ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమా థియేటర్లలో ఏకంగా 1200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్ల పెంపు సైతం ఈ సినిమాకు కలిసొచ్చింది. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత కల్కి 2898 ఏడీ అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ ఓటీటీలలో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. కల్కి సౌత్ భాషల్లో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి అందుబాటులోకి రాగా హిందీ వెర్షన్ మాత్రం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది.
అయితే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ప్రస్తుతం కల్కి 2898 ఏడీ నంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్ అవుతోంది. గతంలో ప్రభాస్ నటించిన సలార్ తో (Salaar) పాటు పలు సినిమాలు ఓటీటీలలో ట్రెండింగ్ లో నిలిచాయి. అయితే ప్రభాస్ సినిమాల థియేటర్ల వెర్షన్ కు ఓటీటీ వెర్షన్ కు స్వల్పంగా మార్పులు ఉన్నాయి. ఈ విధంగా చేయడం వల్ల ప్రభాస్ అభిమానులు ఫీలవుతున్నారు. థియేటర్లలో అలరించిన కొన్ని షాట్స్ ఓటీటీ వెర్షన్ లో లేకపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
ఒకటి రెండు షాట్స్ అయితే ఏమో అనుకోవచ్చు కానీ 5 నిమిషాలకు పైగా షాట్స్ ఓటీటీ వెర్షన్ లో మిస్ అయ్యాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. మేకర్స్ ఈ కామెంట్స్ పై ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. కల్కి మూవీ 50 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం మంచి పరిణామం అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
కల్కి పార్ట్1 సక్సెస్ సాధించిన నేపథ్యంలో కల్కి2 సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. కల్కి సీక్వెల్ లో ఎన్నో ప్రశ్నలకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది. కల్కి సీక్వెల్ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. కల్కి2 మూవీ సైతం సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.