పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ నుండి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నెక్స్ట్ సినిమా ఏంటంటే ‘ది రాజాసాబ్’ (The Rajasaab) అనే చెప్పాలి. మారుతి (Maruthi Dasari) ఈ చిత్రానికి దర్శకుడు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గత రెండేళ్లుగా చూసుకుంటే.. పీపుల్ మీడియా సంస్థ నిర్మించిన సినిమాల్లో ‘మనమే’ (Manamey) ‘విశ్వం’ (Viswam) మినహా మిగిలినవన్నీ డిజాస్టర్లు అయ్యాయి.
వాటికి ఓటీటీలో చాలా సినిమాలను ఓటీటీల్లో విడుదల చేసుకోవడానికి కూడా చాలా కష్టపడింది ‘పీపుల్ మీడియా’ సంస్థ. ఇలాంటి టైంలో ఆ సంస్థకి ఉన్న ఏకైక హోప్ ‘ది రాజాసాబ్’ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ‘శ్వాగ్’ (Swag) సినిమా ప్రమోషన్స్ లో కూడా నిర్మాత విశ్వప్రసాద్ (T. G. Vishwa Prasad) ‘మాకు ఇప్పటివరకు వచ్చిన నష్టాలు అన్నిటినీ ‘ది రాజాసాబ్’ తీర్చేస్తుంది’ అంటూ ఆశాభావం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
‘ది రాజాసాబ్’ సినిమా ప్రభాస్ బ్రాండ్ మీద గట్టిగానే బిజినెస్ చేస్తుంది అనడంలో సందేహం లేదు. ఇదొక హారర్ రొమాంటిక్ డ్రామా. ఇప్పటివరకు రూ.350 కోట్ల బడ్జెట్ పెట్టారు. 85 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మొత్తంగా రూ.400 కోట్లు ఈ చిత్రానికి బడ్జెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పాన్ ఇండియా సినిమా కాబట్టి..
పైగా ‘సలార్’ (Salaar) ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD) ..లతో బ్లాక్ బస్టర్లు అందుకుని ప్రభాస్ మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి.. థియేట్రికల్ రైట్స్ నుండి రూ.300 కోట్లు కంటే ఎక్కువగా రికవరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక డిజిటల్ రైట్స్, డబ్బింగ్ రైట్స్ వంటి వాటి రూపంలో కూడా బిజినెస్ భారీగా జరగొచ్చు.