‘ఆదిపురుష్’ తో (Adipurush) తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఓం రౌత్ (Om Raut) మరో భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ప్రభాస్‌తో (Prabhas) చేసిన పౌరాణిక చిత్రం కొందరికి నిరాశ కలిగించినా, ఓం రౌత్ తన మార్క్ చూపించగలడని బాలీవుడ్‌లో చాలా మంది నమ్ముతున్నారు. ఇప్పుడు, అతను అజయ్ దేవగణ్‌తో (Ajay Devgn) కలిసి మరో హిస్టారికల్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఈ కొత్త ప్రాజెక్ట్‌లో అజయ్ హీరోగా నటించనున్నారని, విలన్ పాత్రలో హృతిక్ రోషన్‌ను (Hrithik Roshan) తీసుకోవాలని చర్చలు జరుగుతున్నాయి.
2020లో వచ్చిన ‘తానాజీ: ది అన్‌సంగ్ వారియర్’ విజయం తర్వాత అజయ్ ఈ ఫ్రాంచైజీని కొనసాగించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తానాజీలో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) చేసిన విలన్ పాత్రకు ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో, అలాగే హృతిక్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సీక్వెల్‌లో హైలైట్ అవుతుందని అజయ్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉంది. కథ గురించి ఇంకా పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోకపోయినా, ఈ సిరీస్‌ను గ్రాండ్ లెవెల్ లో తెరపైకి తీసుకురావాలని చూస్తున్నారు.
మొదట పవన్ ఖింద్ యుద్ధంలో తన ప్రాణాలు అర్పించిన బాజీ ప్రభు దేశ్‌పాండే జీవిత కథను ఆధారంగా చేసుకోవాలని అనుకున్నారు. అయితే, అదే కథ మరాఠీ సినిమా ద్వారా ఇటీవల ప్రేక్షకుల ముందుకు రావడంతో, ఇప్పుడు మరో యోధుడి కథను ఎంచుకోవాలని చర్చిస్తున్నారు. హృతిక్ రోషన్ పాత్రకు సంబంధించిన చర్చలు ఇంకా కొనసాగుతుండగా, అజయ్-ఓం రౌత్ కాంబినేషన్ మరింత గట్టిగా వర్కౌట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.
అజయ్ ఇప్పటికే ‘సింగం ఎగైన్’ (Singham Again) విజయంతో జోరుమీదున్నాడు. హృతిక్ తన చివరి చిత్రం ‘ఫైటర్’తో (Fighter) భారీ విజయం అందుకున్నాడు. ఇది హృతిక్-అజయ్ కలయికలో మొదటి సినిమా కావడం కూడా ప్రాజెక్ట్‌పై హైప్ పెంచుతోంది. ఓం రౌత్, ‘ఆదిపురుష్’ తర్వాత తన కెరీర్‌ను సరిదిద్దుకోవడానికి ఈ ప్రాజెక్ట్‌ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.