Prabhu Deva: ఆడపిల్లకు జన్మనిచ్చిన ప్రభుదేవా రెండో భార్య..!

స్టార్ కొరియోగ్రాఫర్, హీరో, సహాయ న‌టుడు, ద‌ర్శ‌కుడు అయిన ప్ర‌భుదేవాని తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్నాళ్లుగా ప్రభుదేవా మీడియాకి దూరంగా ఉంటూ వచ్చారు. మొన్నామధ్య గాడ్ ఫాదర్ సినిమాలో చిరు, సల్మాన్ లతో ఓ సాంగ్ కంపోజ్ చేసినప్పుడు మాత్రం అందరికీ దర్శనమిచ్చారు ప్రభుదేవా. గతంలో ఇతని పర్సనల్ లైఫ్ పై ఎన్ని వివాదాలు జరిగాయో అందరికీ తెలిసిందే. మొదటి భార్యకి ఇతను విడాకులు ఇచ్చేయడం, తర్వాత నయనతారతో ప్రేమాయణం నడపడం అందరికీ తెలిసిన సంగతే.

ఆమెను పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయ్యాడు. కానీ మధ్యలో మనస్పర్థలు రావడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. తర్వాత ఒంటరిగా ఉంటూ వచ్చిన ప్రభుదేవా.. హిమానీ అనే ఆవిడ‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. తాజాగా వీరికి ఓ పాప జన్మించిందట. హిమానీ ఓ ఫిజియో థెర‌పిస్ట్‌. వెన్ను నొప్పితో బాధ‌ప‌డుతున్న ప్ర‌భుదేవాకు ట్రీట్‌మెంట్ అందించేది. అదే టైంలో ఇద్దరూ ప్రేమలో పడి అటు తర్వాత సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు.

ప్రభుదేవా (Prabhu Deva) రెండో పెళ్లికి ముందు.. అతని మొదటి భార్య రామలత మీడియా ముందుకు వచ్చి చాలా రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ‘నయనతార వల్లే ప్రభుదేవా మమ్మల్ని వదిలేసాడని, తమది కూడా ప్రేమ వివాహమేనని, ప్రభుదేవా కోసం మతం మార్చుకుని మరీ పెళ్లి చేసుకున్నానని.. ! నయన్ వచ్చి మా కాపురంలో చిచ్చు పెట్టిందని ఆమె ఓ రేంజ్లో ఫైర్ అయ్యింది.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus