షూటింగ్ ప్రమాదంలో గాయాలపాలైన ప్రగ్యా జైస్వాల్
- August 1, 2017 / 12:45 PM ISTByFilmy Focus
మంచు విష్ణు, ప్రగ్యా జైస్వాల్ లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మూవీ ఆచారి అమెరికా యాత్ర. నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మూడో షెడ్యూల్ గతవారం మలేషియాలో మొదలయింది. అనుకున్నట్టు అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో బైక్ ప్రమాదం జరిగింది. మంచు విష్ణు వేగంగా బైక్ నడుపుతుండగా స్కిడ్ అయి బాగా దెబ్బలు తగిలాయి. ఆయన ఐసియులో చికిత్స పొందుతున్నారు. అదే బైక్ పై ఉన్న ప్రగ్యా జైస్వాల్ కి కూడా దెబ్బలు తగిలాయని వార్త వ్యాపించింది. అభిమానులు ఆమెకి ఎలా ఉందోనని కంగారుపడ్డారు.
దీనిపై ఆమె స్పందించారు. “ప్రమాదం జరిగిన బైక్ పై నేను కూడా ఉన్నాను. మంచు విష్ణుకు పెద్ద గాయాలు తగిలాయి. నాకు చిన్న గాయాలు తగిలాయి. మీ అందరి ఆశీస్సులతో త్వరలోనే కోలుకుంటా” అని నిన్న ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మలేషియా షెడ్యూల్ పూర్తయిన తర్వాత అమెరికాలో చివరి, షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు చిత్ర నిర్మాతలు కీర్తీ చౌదరీ, కిట్టు పేర్కొన్నారు. బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















