జైలవకుశ లో నెగేటివ్ పాత్ర పై ప్రశంసల వర్షం!

యంగ్ టైగర్ ఎన్టీఆర్! ఒక హీరోకి ఉండవలసిన విషాయాలు అన్నీ ఉన్న అతి కొద్దిమంది వ్యక్తుల్లో ఈ యంగ్ టైగర్ ఒకడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే హీరో అంటే యాక్టింగ్, ఎమోషన్స్, డ్యాన్స్, అన్నింటితో పాటు అందం కూడా కావాలి. అలా అన్నీ ఉన్న వాళ్ళలో మన ఎన్టీఆర్ ఒకడు అంటే అతిశయోక్తి కాదు. ఇదిలా ఉంటే వార్సా పరాజయాలతో కాస్త ఇబ్బందులు పడ్డ ఎన్టీఆర్ ఇప్పుడు వరుస హిట్స్ తో మంచి ఊపు మీద ఉన్నాడు. అంతేకాకుండా హ్యాట్రిక్ హిట్స్ అందుకుని ఇప్పుడు సొంత బ్యానర్ లో మూడు క్యారెక్టర్స్ తో కూడిన సినిమా చేస్తున్నాడు.

ఇక ఆ సినిమాకి జైలవకుశ అన్న పేరు కూడా పెట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు షేడ్స్ లో కనిపించనున్నాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అదే క్రమంలో ఎన్టీఆర్ పుట్టిన రోజు సంధర్భంగా ఎన్టీఆర్ ఫర్స్ట్ లుక్ కి విడుదల చెయ్యడం జరిగింది. అయితే అదే క్రమంలో ఎన్టీఆర్ ఫర్స్ట్ లుక్ లో మీసాలతో సంకెళ్ళు వేసుకున్న చేతులతో, చాలా స్టైలిష్ లుక్ లో క్రుయెల్ ఎమోషన్స్ చూపిస్తూ ఒక్కసారిగా దుమ్ము దులేపేసాడు. అయితే అదే క్రమంలో ఈ ఫర్స్ట్ లుక్ కి అందరూ ఫిదా అయిపోయారు. ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది ఈ ఫర్స్ట్ లుక్. ఇదిలా ఉంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ఫర్స్ట్ లుక్ గురించే డిస్కషన్. అదే క్రమంలో సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్న తారక్ ఫస్ట్ లుక్ లో క్యారక్టర్ ఏదై ఉంటుందా అని ఆరా తీస్తున్నారు అందరూ. ఫస్ట్ లుక్ పోస్టర్ లో రావణుడు బ్యాక్ గ్రౌండ్ లో ఉండేలా అభివాదం చేస్తున్న తారక్ సినిమాలో ఆ పాత్ర యొక్క ఇంటెన్స్ ను చూపించాడు. అయితే సినిమాలో జై కుమార్, లవకుమార్, కుశాల్ గా మూడు పాత్రల్లో నటిస్తున్న తారక్ ఫస్ట్ లుక్ నెగటివ్ రోల్ చేసే జై అని అందరూ అంటున్నారు. ఇక మరో పక్క ఈ పాత్ర పైనే సినిమా అంతా నడుస్తూ ఉంటుందని తెలుస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం కానుంది అని అర్ధం అయిపోతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus