విలక్షణ నటుడిగా ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు ప్రకాష్ రాజ్. ఇతని నటనని ఎంత పొగిడినా తక్కువే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ‘ఘట్టం ఏదైనా పాత్ర ఏదైనా.. నేను రెడీ’ అంటూ ‘జై లవ కుశ’ లో ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ ఇతనికి కరెక్ట్ గా సరిపోతుంది. అంత ట్యాలెంట్ ఉన్న నటుడు కాబట్టే.. ఇప్పటికీ డిమాండ్ ఉన్న నటుడిగా కొనసాగుతున్నారు ప్రకాష్ రాజ్. తండ్రి, మావయ్య, తాత ఇలా ఎటువంటి పాత్రను అయినా.. ఓన్ చేసుకుని దానికి జీవం పోస్తుంటారు ఈయన.
అయితే ఈ మధ్య కాలంలో ప్రకాష్ రాజ్ హవా తగ్గింది అనే కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆయన ఎక్కువ సినిమాల్లో కనిపించడం లేదు అన్న వాదనా వినిపిస్తుంది. అయితే వీటన్నిటికీ ‘వకీల్ సాబ్’ బ్రేక్ వేసేసిందని చెప్పొచ్చు. నందా జీ గా ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ నటన నెక్స్ట్ లెవెల్లో ఉంది. అలా అని ఇదేమి కంప్లీట్ గా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రని చెప్పలేము. ‘నేను మాత్రమే గెలవాలి’ అనే యాటిట్యూడ్ కలిగి ఉన్న పాత్ర.
సెకండ్ హాఫ్లో వచ్చే ప్రకాష్ రాజ్ పాత్రకు థియేటర్లలో ఎక్కువ శాతం విజిల్స్ పడ్డాయి. నిజానికి వకీల్ సాబ్(పవన్ కళ్యాణ్) పాత్రను డామినేట్ చేసే విధంగానే ఈ పాత్ర ఉంది అని చెప్పడంలో సందేహం లేదు. సీరియస్ గా వాదిస్తూనే వినోదానికి కూడా స్కోప్ ఉండేలా ప్రకాష్ రాజ్ పాత్రను డిజైన్ చేసాడు దర్శకుడు వేణు శ్రీరామ్. అలాగే కొన్ని సన్నివేశాల్లో అయితే ప్రేక్షకులకు కోపం తెప్పించేంత నేచురల్ గా నటించారు ప్రకాష్ రాజ్.
Most Recommended Video
వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!