మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరగాలనేది టాలీవుడ్ పెద్ద మనుషుల మాట. ఈ క్రమంలో ఏకగ్రీవం అంశంపై తాజాగా అధ్యక్ష బరిలో నిలిచిన ప్రకాష్ రాజ్ స్పందించారు. ఏకగ్రీవం అనేది తనకు అసలు ఇష్టం లేదని తేల్చి చెప్పారు. దీనికి ఆయన తన వెర్షన్ చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో చర్చ జరగాలని.. ఇప్పుడు అదే జరుగుతోందని అన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న సభ్యులు ఈ రెండేళ్లలో ఏం చేశారో చూడాలి.. నెక్స్ట్ ఏం కావాలనే విషయంపై చర్చ జరగాలని చెప్పారు.
అప్పుడే అసోసియేషన్ కు మంచిదని.. ఎవరో ఒకరి ఆశీర్వాదంతో గెలిస్తే ఏం జరగదని.. ఏకగ్రీవంగా ఎవరో ఒకరిని ఎన్నుకుంటే చర్చకు తావెక్కడుంటుందని ప్రశ్నించారు. అందుకే ఏకగ్రీవ ఎన్నికలపై తనకు నమ్మకం లేదని అన్నారు. ఎన్నికలంటే ఓడిపోవడం, గెలవడం కాదని.. రెండేళ్లలో ఏం జరిగిందనే చర్చ జరిగి.. తర్వాత రెండేళ్లకు మరో మంచి అభ్యర్థిని ఎన్నుకోవడం అనే ప్రక్రియ జరగాలని చెప్పారు. మంచు విష్ణుతో గతంలో మాట్లాడిన విషయం గురించి చెప్పుకొచ్చారు.
తను పోటీ చేస్తున్నట్లు అప్పటికి మంచు విష్ణుకి తెలియదని.. ‘మీరు ఉన్నారని తెలియక పోటీకి దిగానని’ మంచు విష్ణు తనతో చెప్పినట్లుగా ప్రకాష్ రాజ్ వెల్లడించారు. ‘దాంట్లో ఏముంది నువ్ కూడా పోటీ చేయు అని’ తాను చెప్పినట్లు ప్రకాష్ రాజ్ గుర్తు చేసుకున్నారు. నరేష్ కి కూడా ఫోన్ చేసి చెబితే ఆల్ ది బెస్ట్ చెప్పారని తెలిపారు.
Most Recommended Video
బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!