#JustAsking… ఏదైనా విషయాన్ని వ్యంగ్యంగా చెప్పడానికో, అడగడానికో సోషల్ మీడియాలో వాడుతుంటారు. ఆ మధ్య రామ్‌గోపాల్ వర్మ ఈ పదం వాడి కొన్ని ట్వీట్స్ చేసి వైరల్ చేశారు. ఇప్పుడు అదే పని చేస్తున్నారు నటుడు ప్రకాశ్ రాజ్. విషయం పూర్తిగా చెప్పకుండా, దేని గురించో చెప్పకుండా #JustAsking అని ట్యాగ్ యాడ్ చేస్తూ కొన్ని ట్వీట్లు చేస్తున్నారు. సీజన్‌ను అర్థం చేసుకుంటే అదెందుకో మనకు సులభంగా తెలిసిపోతుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల గురించి చాలా రోజుల నుండి చర్చ జరుగుతూనే ఉంది.
‘పోటీలో ఉన్నా’ అంటూ ఆయన ప్రకటించినప్పటి నుండి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ‘ఎన్నికలు ప్రకటించేవరకు మమ్మల్ని టీవీ చర్చలకు పిలవొద్దు’అంటూ పెద్ద ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పారు. అయితే ఆయన మాత్రం ట్వీట్లు చేస్తూ చర్చలకు దారి ఇస్తూనే ఉన్నారు. తాజాగా ‘తెగేదాకా లాక్కండి’ అంటూ ఓ ట్వీట్ చేశారు. సెప్టెంబరులో ‘మా’ ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల ప్రముఖ నటుడు కృష్ణంరాజు నేతృత్వంలోని ‘మా’ క్రమశిక్షణ సంఘం నిర్ణయించింది.
అయితే ఆగస్టు 22న జనరల్ బాడీ సమావేశం నిర్వహించి దీనిపై పూర్తిస్థాయి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరోవైపు ఈసారి ఎన్నికలను ఏకగ్రీవం చేయాలనే వాదనలూ కూడా పెరిగాయి. మొన్నీమధ్య ‘మా’ మాజీ అధ్యక్షుడు, నటుడు నరేశ్ కూడా ఏకగ్రీవం గురించి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రకాశ్‌రాజ్ ఇలా ‘తెగేదాకా లాక్కండి’ అంటూ ట్వీట్ చేయడం గమనార్హం.
Most Recommended Video
ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!