ప్రణం దేవరాజ్, శంకర్, పి.హరికృష్ణ గౌడ్, హరి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్1 గ్రాండ్ గా ప్రారంభం

ప్రణం దేవరాజ్ ప్రధాన పాత్రలో శంకర్ దర్శకత్వంలో పి.హరికృష్ణ గౌడ్ నిర్మాణంలో ఓ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రూపొందుతోంది. హరి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1గా తెలుగు, కన్నడ భాషలలో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఈరోజు ఘనంగా ప్రారంభమైయింది. ముహూర్తపు సన్నివేశానికి ఆకాష్ పూరి క్లాప్ కొట్టగా, దేవరాజ్ కెమరాస్విచాన్ చేశారు. తనికెళ్ళ భరణి మేకర్స్ కి స్క్రిప్ట్ అందించి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. స్టార్ కంపోజర్ శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా, బాల సరస్వతి డీవోపీగా పని చేస్తున్నారు. శ్రీ వర్కాల ఎడిటర్ కాగా, గురు మురళీకృష్ణ ఆర్ట్ డైరెక్టర్.

సినిమా లాంచింగ్ ఈవెంట్ లో దర్శకుడు శంకర్ మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమా. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత హరి గౌడ్ గారికి ధన్యవాదాలు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వుండే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. తెలుగు, కన్నడ ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. మొదటి షెడ్యుల్ జనవరి మూడో వారం నుంచి హైదరాబాద్, తర్వాత వైజాగ్ పరిసర ప్రాంతాల్లో నిర్విరామంగా జరుగుతుంది” అన్నారు

తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. సినిమా నిర్మాణం అంటే చాలా ప్యాషన్ వుండాలి. అలాంటి ప్యాషన్ తో నిర్మాత హరి గౌడ్, హరి క్రియేషన్స్ బ్యానర్ ని స్థాపించి నిర్మాణ రంగంలోకి రావడం ఆనందంగా వుంది. దేవరాజు గారు పాన్ ఇండియా నటుడు. ఎన్నో అవార్డులు సాధించారు. ఆయన వారసత్వాన్ని వాళ్ళ అబ్బాయి ప్రణం దేవరాజ్ పుణికిపుచ్చుకుని ఈ రంగంలోకి రావడం చాలా సంతోషంగా వుంది. ఇది తనకి మూడో చిత్రం. ఇప్పటికే కన్నడలో మంచి పేరు తెచ్చుకున్నారు. శంకర్ చాలా ప్రతిభ వున్న దర్శకుడు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించి అందరికీ పేరు ప్రతిష్టలు రావాలి’ అని కోరారు

హీరో ప్రణం దేవరాజ్ మాట్లాడుతూ.. ఇది తెలుగులో నాకు మూడో చిత్రం. చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ వున్న కథ. మంచి లవ్ స్టొరీ, యాక్షన్ వుంది. మీ అందరి ప్రోత్సాహం కావాలి” అని కోరారు.

దేవరాజ్ మాట్లాడుతూ.. దర్శకుడు శంకర్ చాలా అద్భుతమైన కథని రాసుకున్నారు. కథ చాలా బావుంది. హరి గౌడ్ మంచి అభిరుచి వున్న నిర్మాత. చాలా మంచి టీం కలసి చేస్తున్న సినిమా ఇది. తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. మీ అందరి ఆశీస్సులు వుండాలి” అని కోరారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. ఇది మా మొదటి ప్రొడక్షన్. మమ్మల్ని ఆశీర్వదించిన తనికెళ్ళ భరణి గారు, నరసింహారెడ్డి గారు, ఆకాష్ పూరిగారు, దేవరాజ్ గారికి కృతజ్ఞతలు, అందరికి పేరుపేరునా కృతజ్ఞతలు’ తెలిపారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus