పిక్‌ టాక్‌: బర్త్‌డే చరణ్‌తో… పెళ్లి రోజు ప్రశాంత్‌తో

ప్రశాంత్‌ నీల్‌ – తారక్‌ కాంబినేషన్‌ కోసం ఫ్యాన్స్‌ చాలా రోజులుగా వెయిట్‌ చేస్తున్నారు. సినిమా ఉంది అని అన్నప్పటి నుండి ఏదో విధంగా ఇద్దరి ఫొటోలు, వార్తలు, అభిప్రాయాలు వైరల్‌ అవుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి తారక్‌ – ప్రశాంత్‌ ఫొటో వైరల్‌ అయ్యింది. అయితే దీనికి ఓ కారణం ఉంది. అదే పెళ్లి రోజు. ఓహ్‌… అవును కదా మే 5న ఎన్టీఆర్‌ – లక్ష్మీప్రణతి పెళ్లి రోజు కదా అంటారా. అంతే కాదు ప్రశాంత్‌ నీల్‌ పెళ్లి రోజు కూడా ఇదేనట.

ఈ విషయాన్ని చెబుతూనే ఎన్టీఆర్‌ నిన్నరాత్రి ఓ ఫొటో షేర్‌ చేశాడు ఎన్టీఆర్‌. అందులో ఎన్టీఆర్‌ – లక్ష్మీ ప్రణతి, ప్రశాంత్‌ నీల్‌ – లిఖిత ఉన్నారు. రెండు కుటుంబాలు కలసి వివాహ వార్షికోత్సవం జరుపుకున్నాం అంటూ రాసుకొచ్చాడు తారక్‌. ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమానులు, ప్రశాంత్‌ నీల్‌ ఫ్యాన్స్‌ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరగా మీ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లండి అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఎన్టీఆర్‌తో తన స్నేహం 20 ఏళ్ల నుండి ఉందని, అతనంటే నాకు చాలా ఇష్టం అంటూ… ఆ మధ్య ప్రశాంత్‌ నీల్‌ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇద్దరూ కలసి ఫొటోలకు పోజిచ్చిన సందర్బాలు ఎప్పుడూ కనిపించలేదు. ఇప్పుడు ఇలా వెడ్డింగ్‌ యానివర్శిరీ సందర్భంగా వాళ్ల స్నేహం బయటికొచ్చింది. ప్రస్తుతం కొరటాల శివతో ఓ సినిమా చేస్తున్నారు తారక్‌. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారని సమాచారం.

మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి కాన్సెప్ట్‌ను ఎన్టీఆర్‌కు ప్రశాంత్‌ ఇప్పటికే వివరించారని సమాచారం. ప్రస్తుతం ప్రశాంత్‌ టీమ్‌.. ఈ సినిమా కథను పూర్తి స్థాయిలో సిద్ధం చేసే పనిలో ఉన్నారట. ‘సలార్‌’ సినిమా తర్వాత ఈ సినిమానే స్టార్ట్‌ చేస్తారు అంటున్నారు. ఈలోపు మనకు చాలా విషయాలు తెలుస్తాయిలెండి.

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus