Prasanth Neel: ఆ తప్పు మాత్రం చేయొద్దంటున్న ప్రశాంత్ నీల్.. ఏమైందంటే?

ప్రస్తుత కాలంలో డైరెక్టర్ కావడం అంటే అంత సులువైన విషయం కాదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా అనుభవం ఉంటే మాత్రమే డైరెక్టర్ కావడం సాధ్యమవుతుంది. అయితే ప్రశాంత్ నీల్ (Prashanth Neel) మాత్రం ఎలాంటి అనుభవం లేకుండానే డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టారు. ప్రశాంత్ నీల్ తొలి సినిమా ఉగ్రం అనే సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్రశాంత్ నీల్ ఆరు నెలల్లో పూర్తి చేయాలని భావిస్తే షూట్ పూర్తి కావడానికి నాలుగేళ్ల సమయం పట్టిందట.

ఉగ్రం సినిమా రీషూట్ లకు సైతం ఎక్కువ సమయం పట్టిందని అందుకే ఈ సినిమా షూట్ చాలా సంవత్సరాల పాటు జరిగిందని భోగట్టా. తొలి సినిమా డైరెక్షన్ విషయంలో నన్ను ఫాలో కావద్దని నేను చేసిన తప్పు మీరు చేయొద్దని ప్రశాంత్ నీల్ కామెంట్లు చేశారు. ఉగ్రం సినిమా విడుదలై 10 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆయన ఈ కామెంట్లు చేయడం జరిగింది. అయితే తొలి సినిమాతోనే ప్రశాంత్ నీల్ సక్సెస్ సాధించారు.

ప్రశాంత్ నీల్ (KGF) కేజీఎఫ్, (KGF2) కేజీఎఫ్2 సినిమాలతో మార్కెట్ ను పెంచుకోవడంతో పాటు అభిమానులకు మరింత దగ్గరయ్యారు. ప్రశాంత్ నీల్ కూడా సలార్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నారు. (Salaar) సలార్2 సినిమాపై ప్రశాంత్ నీల్ భారీగా అంచనాలను పెంచేశారు. ప్రశాంత్ నీల్ అతి త్వరలో సలార్2 సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది.

సలార్2 శౌర్యాంగ పర్వం సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం అందుతోంది. సలార్2 సినిమాలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయని సమాచారం అందుతోంది. ప్రభాస్ 2026 సంవత్సరంలో సలార్2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. (Prabhas) ప్రభాస్ (Kalki) కల్కి సినిమాతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రభాస్ వరుసగా సినిమాల్లో నటిస్తుండటంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు.

ఇంటర్వ్యూ : ‘గామి’గురించి డైరెక్టర్ విద్యాధర్ కాగిత చెప్పిన ఆసక్తికర విషయాలు.!

ఇంటర్వ్యూ : ‘భీమా’ గురించి గోపీచంద్ చెప్పిన ఆసక్తికర విషయాలు
రోడ్డుపై యాంకర్ ఝాన్సీ చెత్త సేకరించడానికి కారణాలివేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus