Prasanth Varma: జక్కన్నపై ప్రశాంత్ వర్మ కోపానికి రీజన్స్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

తక్కువ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరును సంపాదించుకుని, స్టార్ స్టేటస్ ను అందుకున్న డైరెక్టర్లలో ప్రశాంత్ వర్మ ఒకరు. ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీ సక్సెస్ తర్వాత వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఆ ఇంటర్వ్యూలలో చెప్పిన విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఆదిపురుష్ గురించి ప్రశాంత్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి. అయితే రాజమౌళిపై కోపం అంటూ ప్రశాంత్ వర్మ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ఈ విషయాలను చెప్పుకొచ్చారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి అంటే తనకెంతో ఇష్టమని జక్కన్న టీమ్ లో పని చేయాలనే ఆలోచనతో నేను ఎన్నో ప్రయత్నాలు చేశానని ఆయన అన్నారు. రాజమౌళి మేకింగ్ స్టైల్ అంటే ఎంతో ఇష్టమని రాజమౌళి దగ్గర అసిస్టెంట్ గా పని చేయడం కోసం ఎన్నోసార్లు ప్రయత్నించానని ప్రశాంత్ వర్మ వెల్లడించారు.

బీటెక్ చదువుతున్న సమయంలో అవకాశం కోసం జక్కన్నకు మెయిల్స్ పంపానని నా అభ్యర్థనను రాజమౌళి సున్నితంగా తిరస్కరించడం జరిగిందని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు. టీమ్ లో ఖాళీ లేదని రాజమౌళి చెప్పారని ఆయన వెల్లడించారు. కష్టపడే గుణం, ప్రతిభ ఉన్నా రాజమౌళి తీసుకోవడం లేదని ఆయనపై కోపం వచ్చిందని ఆ సమయంలో ఏకలవ్యుడు గుర్తుకు వచ్చి జక్కన్న సినిమాలు, మేకింగ్ వీడియోలు చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ప్రశాంత్ వర్మ తెలిపారు.

స్టార్ హీరోలతో పని చేయడానికి నేను వ్యతిరేకం కాదని స్టార్స్ తో సినిమా అంటే ఎక్కువ సమయం పడుతుందని స్టార్స్ కోసం ఎదురుచూసి సమయాన్ని వృథా చేసుకున్న సందర్భాలు సైతం ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం డెడ్ లైన్ పెట్టుకుని వర్క్ చేస్తున్నానని టామ్ క్రూజ్ వచ్చినా నా దగ్గర ఉన్నవాళ్లతోనే సినిమా చేస్తానని ప్రశాంత్ వర్మ కామెంట్లు చేశారు. ప్రశాంత్ వర్మ (Prasanth Varma) వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus