ప్రశాంత్ నీల్ మూవీలో మాఫియా డాన్ గా ఎన్టీఆర్?

కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ మూవీ అనేది దాదాపు ఖాయమే. దీనిపై అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ దర్శకుడు ప్రశాంత్ నీల్ మరియు నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ పరోక్షంగా హింట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ప్రశాంత్ నీల్, మైత్రి మూవీ మేకర్స్ చేసిన ట్వీట్స్ ఈ ప్రాజెక్ట్ ని ధ్రువపరిచాయి. అలాగే ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ అణుప్లాంట్ అని, రేడియేషన్ తట్టుకోవడం కష్టం అంటూ ప్రశాంత్ చేసిన ట్వీట్స్ ఆసక్తిరేపాయి.

ఏదిఏమైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకుంటున్న ఒక క్రేజీ కాంబినేషన్ అయితే సెట్ అయ్యింది. ఆర్ ఆర్ ఆర్ మరియు త్రివిక్రమ్ సినిమాలు పూర్తి అయిన వెంటనే ఈ భారీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ఈ మూవీ స్టోరీ లైన్ ఇదేనంటూ పరిశ్రమలో ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. మిస్సైల్ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఓ మాఫియా డాన్ పాత్ర చేయనున్నారట. ప్రపంచాన్నే గడగడలాడించే మాఫియా లీడర్ గా ఎన్టీఆర్ ని ఆయన ప్రెజెంట్ చేయనున్నారట.

ఇక ఈ మూవీ నేపథ్యం కూడా దేశాల మధ్య జరిగే బయోవార్ అని ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియదవు కానీ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తున్నాయి. గతంలో ఎన్టీఆర్ బాద్షా మూవీలో మాఫియా లీడర్ రోల్ చేశారు. హీరోయిజం ఎలివేట్ చేయడంలో తిరుగలేదనిపించుకున్న ప్రశాంత్ నీల్ డాన్ గా ఎన్టీఆర్ ని ఈ రేంజ్ లో చూపిస్తాడో తలచుకుంటేనే గూస్ బంప్స్ కలుగుతున్నాయి.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus