Prashanth Neel: తారక్ వల్ల ప్రశాంత్ నీల్ ప్లాన్ మారిందా.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకులలో ప్రశాంత్ నీల్ ఒకరు కాగా సినిమాల విషయంలో ప్రశాంత్ నీల్ ప్లానింగ్ మారిందని తెలుస్తోంది. ఎన్టీఆర్ వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్న నేపథ్యంలో సలార్2 పూర్తి చేసి ఎన్టీఆర్ సినిమాను మొదలుపెట్టాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ప్రశాంత్ మూవీని మైత్రీ నిర్మాతలు నిర్మిస్తున్న నేపథ్యంలో మైత్రీ నిర్మాతల నుంచి ఇందుకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ షూట్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు ఉండే ఛాన్స్ లేదు.

దేవర పూర్తైన వెంటనే తారక్ వార్2 సినిమాతో బిజీ కానున్నారు. వార్2 సినిమాలో సైతం తారక్ పాత్ర కీలకమని తెలుస్తోంది. వార్2 షూటింగ్ కోసం తారక్ ఎన్ని నెలల సమయం కేటాయిస్తారో తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాది ఇండిపెండెన్స్ డే కానుకగా వార్2 సినిమా రిలీజ్ కానుంది. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సలార్2 సినిమా షూట్ ను త్వరగా మొదలుపెడితే మాత్రం 2025లో సలార్2 2026లో ఎన్టీఆర్ మూవీ రిలీజయ్యే ఛాన్స్ ఉంటుంది.

ప్రభాస్ ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ సినిమాలలో నటిస్తూ అన్ని సినిమాలకు డేట్లు కేటాయిస్తూ నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా షూటింగ్ లు జరిగేలా ప్లాన్ చేసుకుంటున్నారు. త్వరలో ప్రశాంత్ నీల్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ రానుంది. మరోవైపు సలార్ ఓటీటీ రిలీజ్ డేట్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

మరికొన్ని వారాల తర్వాత సలార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యి ఉంటే బాగుండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. సలార్ మూవీ అన్ని సౌత్ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. సలార్ మూవీ వ్యూస్ పరంగా సంచలనాలు సృష్టించడం ఖాయమని నెట్ ఫ్లిక్స్ నిర్వాహకులు ఫీలవుతున్నారు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus