ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ 200 కోట్లు?

కన్నడ చిత్ర పరిశ్రమలో మొదటిసారి 1000కోట్లు అందుకున్న సినిమా కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా సరికొత్త రికార్డ్ను క్రియేట్ చేసింది. అసలు ఈ సినిమా ఆ స్థాయిలో సక్సెస్ అవుతుందనే ఎవరు కూడా ఎవరూ ఊహించలేదు. ఇక మొత్తానికి సెకండ్ పార్ట్ అయితే ఊహించని విధంగా భారీ స్థాయిలో సక్సెస్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా వెయ్యి కోట్ల కలెక్షన్స్ అందుకుంది కాబట్టి తప్పకుండా చిత్ర నిర్మాతలు భారీ స్థాయిలో లాభాలు వచ్చి ఉంటాయి. అయితే ఈ సినిమా వచ్చిన లాభాల్లో దర్శకుడికి కూడా వాటా ఉంది. అసలైతే ఈ సినిమాకు అతను జీతంగా 25 కోట్లు మాత్రమే అందుకున్నాడు. ఇక సక్సెస్ అయితే మాత్రం లాభాల్లో వాటా ఉంటుందని ముందుగానే ఒప్పందం చేసుకున్నారు.

ఇప్పుడు సినిమా ఏకంగా వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది కాబట్టి దర్శకుడు ప్రశాంత్ నీల్ కు పారితోషకం తో పాటు లాభాలు ఏ స్థాయిలో వచ్చి ఉంటాయో ఊహించవచ్చు. కేజిఎఫ్ 2 సినిమా కు దాదాపు 600 నుంచి 700 కోట్ల షేర్ రావచ్చు. అంటే దర్శకుడికి అందులో 120 నుంచి 140 కోట్ల మధ్యలో వాటా దక్కుతుంది. అంటే మొదట ఇచ్చిన పారితోషికం తో పాటు ఇప్పుడు లాభాలతో కలిపి దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా 150 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది అని చెప్పవచ్చు.

ఇక ప్రస్తుతం ఈ సినిమా కోసం దర్శకుడు ప్రశాంత్ 50కోట్ల వేతనాన్ని అందుకుంటున్నాడు. ఇక సలార్ సినిమాకు కూడా ఇదే తరహాలో లాభాల్లో వాటా తీసుకోనున్నారు. తప్పకుండా ఆ సినిమా కూడా భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుంది అని చెప్పవచ్చు. ఇక ఈ లెక్కలు చూస్తే ప్రశాంత్ నీల్ రాబోయే ఎన్టీఆర్ సినిమాకు జీతం అలాగే షేర్ ప్రాఫిట్ తో కలిపి ఈజీగా రెండు వందల కోట్ల పారితోషకాన్ని అందుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ రేంజ్ లో మాత్రం అతనికి పారితోషికం వస్తే దాదాపు రాజమౌళితో సమానంగా అతను కూడా ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ అవుతాడు అని చెప్పవచ్చు.

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus