Salaar: సలార్2 విషయంలో ఫ్యాన్స్ కు భారీ షాక్.. ఏం చెప్పారంటే?

సలార్1 మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి మరో 17 రోజుల సమయం మాత్రమే ఉంది. సలార్1 మూవీ అటు ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇటు ప్రశాంత్ నీల్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చేలా ఉండనుందని సమాచారం. ప్రభాస్ ఎంట్రీ వరకు సినిమా ఒకలా ఉంటుందని ప్రభాస్ ఎంట్రీ తర్వాత సినిమా మరోలా ఉండనుందని సమాచారం అందుతోంది. అయితే సలార్2 కు సంబంధించిన అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే సలార్2 విషయంలో ఫ్యాన్స్ కు భారీ షాక్ తగిలింది. సలార్ మూవీ కథ ఎప్పుడో రాసుకున్న కథ అని ప్రశాంత్ నీల్ తెలిపారు. సలార్2 మూవీ ఎప్పుడు మొదలవుతుందో ఇప్పుడే చెప్పలేనని ప్రశాంత్ నీల్ అన్నారు. ఇది లాజిస్టికల్‌ థింగ్‌ అని అందుకే సరైన సమయం చెప్పి కమిట్ కాలేకపోతున్నానని ఆయన అన్నారు. అభిమానులకు ప్రశాంత్ నీల్ ఒకింత భారీ షాక్ ఇచ్చారనే చెప్పాలి.

ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా పూర్తి చేసిన తర్వాత మాత్రమే (Salaar) సలార్2 గురించి లేదా కేజీఎఫ్3 గురించి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీకి సంబంధించి స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకు ఒకింత భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. రెమ్యునరేషన్ లో కొంత మొత్తాన్ని లాభాల రూపంలో తారక్ తీసుకుంటున్నారని భోగట్టా.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు దేశవిదేశాల్లో షూటింగ్ జరుపుకోనున్నాయని సమాచారం అందుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో దేవర సినిమా ప్రమోషన్స్ లో పాల్గొననున్నారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కు రాబోయే రోజుల్లో వరుస విజయాలు దక్కుతాయేమో చూడాల్సి ఉంది. ఇతర ఇండస్ట్రీలలో సైతం తారక్ సత్తా చాటుతూ క్రేజ్ ను పెంచుకుంటున్నారు.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus