Prashanth Neel: అంత తక్కువ సమయంలో సలార్2 షూట్ పూర్తి చేయడం సాధ్యమా?

స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashant Neel) సలార్1 (Salaar) సినిమాతో బెస్ట్ హిట్ అందుకోగా ఈ సినిమా బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సలార్2 సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్ డేట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నెలాఖరు నుంచి ఈ సినిమా షూట్ మొదలుకానుందని సోషల్ మీడియా వేదికగా సమాచారం అందుతోంది.

అయితే ఆరు నెలల్లోనే ఈ సినిమాను పూర్తి చేసేలా మేకర్స్ ప్లాన్స్ ఉన్నాయని తెలుస్తోంది. సలార్2 సినిమాను ఆరు నెలల్లో పూర్తి చేయాలని భావించడం అంటే ఒక విధంగా రిస్క్ అనే సంగతి తెలిసిందే. నవంబర్ నెలలోపు ఈ సినిమాను పూర్తి చేయాలని టార్గెట్ ఉన్నట్టు భోగట్టా. అయితే సినిమాను మరీ వేగంగా షూట్ చేస్తే సినిమా క్వాలిటీపై ప్రభావం పడుతుంది. ప్రశాంత్ నీల్, ప్రభాస్ (Prabhas) ఈ ఆరు నెలల టార్గెట్ విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

మరోవైపు ప్రభాస్ వరుసగా ఆరు నెలల పాటు డేట్స్ కేటాయించడం కూడా సులువు కాదు. ప్రశాంత్ నీల్ పై ఈ నిర్ణయం భారం పెంచే అవకాశం ఉంది. భారీ బడ్జెట్ సినిమాలకు ఒత్తిడితో పని చేయడం వల్ల ఔట్ పుట్ పై కూడా ప్రభావం పడుతుంది. సలార్2 సినిమాకు ప్రభాస్ పూర్తిస్థాయిలో డేట్స్ కేటాయిస్తే ఇతర సినిమాలపై ప్రభావం పడుతుంది. ఈ సినిమా విషయంలో ప్రభాస్ ఏం చేస్తారో చూడాలి.

ప్రభాస్ సలార్2 సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఛార్జ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సలార్2 మూవీ థియేట్రికల్ రైట్స్ కోసం గట్టి పోటీ నెలకొనగా ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. బాహుబలి2 (Baahubali 2) స్థాయిలో హిట్ అయ్యే సత్తా సలార్2 సినిమాకు ఉండగా త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని క్రేజీ అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus