Prashanth Varma: అందరికీ క్షమాపణలు చెబుతున్న ప్రశాంత్ వర్మ!

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తాజాగా హనుమాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా గుంటూరు కారం సినిమా కలెక్షన్లను మించి భారీ వసూళ్లను రాబడుతూ సంచలనాలను సృష్టిస్తుంది. ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఎంతోమంది అభిమానులు ఇతర చిత్ర బృందం అలాగే నెటిజెన్స్ సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అదేవిధంగా మరికొందరు ఈయనను పర్సనల్ గా ఫోన్ చేసి మరి అభినందిస్తున్నారు. ఇలా ఆయన పనితీరుకు ప్రశంసలు వస్తున్నటువంటి తరుణంలో ఈయన మాత్రం సోషల్ మీడియా వేదికగా అందరికీ క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు. ప్రశాంత్ వర్మ తనకు మూడు రోజుల నుంచి బాగా జ్వరంగా ఉందని.. అందుకే అందరి కాల్స్.. మెసేజెస్ తాను ఎత్తడం లేదని.. ఒక్కసారి తనకు ఆరోగ్యం బాగా అయ్యాక అందరికీ జవాబులు ఇస్తానని…

అందరికీ క్షమాపణలు చెబుతున్నాను అంటూ ఈ సందర్భంగా (Prashanth Varma) ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. సూపర్ హిట్ సాధించడంతో దర్శకుడు ప్రశాంత్ వర్మకి వరసగా మెసేజీలు, కాల్స్ వస్తున్నాయట. కానీ తన ఆరోగ్యం వల్ల అతను ఎవరికీ రిప్లై ఇవ్వలేదట. ఇలా తమకు రిప్లై ఇవ్వకపోవడంతో అందరూ ఎందుకు ప్రశాంత్ మౌనంగా ఉన్నారు అంటూ సందేహాలను వ్యక్తం చేశారు.

అంతలోపే ఈయన తన ఆరోగ్యం బాగాలేదు అంటూ అసలు విషయం చెప్పడంతో ప్రతి ఒక్కరు కూడా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక ఈ సినిమా అన్ని ప్రాంతాలలోనూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బుక్ మై షో లో కూడా ఈ చిత్రానికి ఏకంగా 50k మంది పైగా యూజర్లు 9.6 రేటింగ్ ఇచ్చి సంక్రాంతి సినిమాలల్లో విన్నర్ గా నిలబెట్టారు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus