ప్రవీణ్‌ సత్తారు కొత్త సినిమా కబురు

చేసినవి ఐదు సినిమాలే అయినా.. దేనికదే విభిన్నంగా ఉంటూ క్రియేటివ్‌ డైరక్టర్‌ అనిపించుకున్నాడు ప్రవీణ్‌ సత్తారు. అయితే ‘పీఎస్‌వీ గరుడవేగ’ లాంటి హిట్‌ తర్వాత ఇప్పటివరకు కొత్త సినిమా మొదలవలేదు. ఆ సినిమా వచ్చి నాలుగేళ్లు అవుతున్న విషయం తెలిసిందే. మధ్యలో ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌ జీవిత కథ ఆధారంగా సినిమా తీస్తున్నట్లు ప్రకటించినా.. అది ఇంకా ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లోనే నిలిచిపోయింది. అయితే ఇప్పుడు వరుస సినిమాలు చేసుకుంఉన్నాడని తెలుస్తోంది.

‘పుల్లెల గోపీచంద్‌’ సినిమా పనులు నడుస్తుండగానే ప్రవీణ్‌ మరో కథలు సిద్ధం చేసుకొని, హీరోలతో ఓకే కూడా చేయించుకున్నాడట. నాగార్జునతో ఓ సినిమా ఈ నెలాఖరులో మొదలవుతుందని నిన్ననే చదువుకున్నాం. ఇప్పుడు వరుణ్‌తేజ్‌తో ఓ సినిమా ఓకే చేసుకున్నాడనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. మెగా ఫ్యామిలీలో విభిన్నమైన శైలిలో సినిమాలు ఎంచుకుంటున్న వరుణ్‌ తేజ్‌ కోసం డిఫరెంట్‌ కథ చెప్పాడట ప్రవీణ్‌ సత్తారు. ప్రస్తుతం దానిని పూర్తిస్థాయిలో సిద్ధం చేసే పనిలో ఉన్నాడట ప్రవీణ్‌.

ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌ ‘గని’, ‘F 3’ చేస్తున్నాడు. ఆ రెండు సినిమాలు అయ్యాక ప్రవీణ్‌ సత్తారు సినిమా ఉంటుందని టాక్‌. ఈలోగా నాగార్జున సినిమా పూర్తి చేసుకుంటాడట. అంటే నాలుగేళ్ల గ్యాప్‌ను వరుస సినిమాలతో ఫుల్‌ఫిల్‌ చేయడానికి ప్రవీణ్‌ సత్తారు ప్లాన్‌ చేసుకుంటున్నాడు. ఇలాంటి దర్శకుడు వరుస సినిమాలతో వస్తే అందరికీ హ్యాపీనే కదా.

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus