రాజమౌళిఫై గ్రహాల ప్రభావం.. నిజమెంత?

“నేనొక సినిమా పిపాసిని”.. రాజమౌళి మీద మాంటేజ్ సాంగ్ తీయాలంటే.. ఇలాంటి సాహిత్యం వాడుకోవచ్చు. సినిమా అంటే జక్కన్నకు అంత పిచ్చి. తను మనసులో ముద్రించుకున్న బొమ్మని తెరమీద కదలడేలా చేయడానికి పారితోషికాన్ని వదులుకున్న సందర్భాలున్నాయి. సొంత ఇంటిని అమ్ముకొని రోడ్డున పడిన క్షణాలు ఉన్నాయి. చివరికి తన నమ్మకం.. కల గెలిచి దర్శకధీరుడిని చేశాయి. అతని పట్టుదల, కృషి దాటికి పదిహేడేళ్ళుగా అపజయం ఆమడదూరంలో ఉంది. రాజమౌళి ఎదురుగా నిలబడేందుకు దైర్యం లేకుండా పారిపోతుంది. అటువంటి జక్కన్నపై ఓ ప్రచారం సాగుతోంది. ఇప్పటి వరకు రాజమౌళి పై శుక్రుడు ప్రభావం ఉన్నదని, అందువల్ల అతను ఏ చిత్రం చేసినా విజయం సాధించిందని కొంతమంది చెబుతున్నారు.

అతని జాతక రిత్యా ఆ శుక్ర దశ వీడిపోయిందని.. ఇప్పుడు ఇతర గ్రహాల ప్రభావం రాజమౌళిపై పడబోతుందని జ్యోతిష్యులు చెప్పారంట. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిచారంట. అయితే ఇవేమి జక్కన్న పట్టించుకోవడంలేదు. అసలే నాస్తికుడు అయిన రాజమౌళి ఈ గ్రహాలను పక్కన పెట్టి.. పెన్ను పేపర్ చేత పట్టి నెక్స్ట్ సినిమా స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నారు. రాజమౌళి సీరియస్ గా తీసుకోకపోయినా అతని కుటంబసభ్యులు కొంతమంది దీనిపై శ్రద్ధపెట్టారు. జ్యోతిష్య పండితులు సూచించిన ప్రకారం శాంతి పూజలు హోమాలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఈ విషయంపైనే రాజమౌళి సన్నిహితులు కొందరు మంత్రాలయంలో ఉన్నారని టాక్. రామ్ చరణ్, ఎన్టీఆర్ ల మల్టీస్టారర్ మూవీ అధికారిక ప్రకటన ఆలస్యానికి కూడా ఇదే కారణమని తెలిసింది. ఈ పూజలు అయిన తర్వాత ప్రకటించనున్నారని టాక్. ఇదంతా నిజమేనా? అని ట్రేడ్ వర్గాల వారు ఆశ్చర్యపోతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus