లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్

  • December 12, 2017 / 08:04 AM IST

సుప్రసిద్ధ నటీమణి గౌతమి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా అందలాన్నందుకొన్న గౌతమి ఆత్మవిశ్వాసంతో క్యాన్సర్ ను సైతం జయించి, తనలా మరెవరూ బాధపడకూడదనే దృఢ నిశ్చయంతో “లైఫ్ ఎగైన్” ఫౌండేషన్ ను ప్రారంభించారు. నేడు (డిసెంబర్ 10న) స్టార్ హాస్పిటల్స్ సౌజన్యంతో లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ హైదరాబాద్ లోని మైత్రీవనంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజకీయవేత్త జయప్రకాష్ నారాయణ్, నటి గౌతమి, సీనియర్ ఆర్టిస్ట్ సన, డాక్టర్ హైమారెడ్డి, డాక్టర్ నవీన్, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన సోషల్ యాక్టివిస్ట్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ రమాదేవి, డాక్టర్ శివ, డాక్టర్ గీత, డాక్టర్ భార్గవి, డాక్టర్ కృష్ణ పుట్టపర్తి, యాక్టర్ కమ్ యాంకర్ టి.ఎన్. ఆర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నటి గౌతమి మాట్లాడుతూ.. “మనిషి ఆనందంగా బ్రతకడానికి కావాల్సింది చదువు, ఆరోగ్యం. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగా లేదు, కానీ ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంది, మన ఆరోగ్యం పాడైంది అంటే దానికి కారణం మనమే. ఈ విధమైన ఫ్రీ మెడికల్ క్యాంప్స్ ప్రతి చోట నిర్వహించలేకపోవచ్చు, కానీ మనిషి బ్రతకాల్సింది సమస్యలతో, రోగాలతో కాదు సుఖసంతోషాలతో. ఈ మెడికల్ క్యాంప్ ను అందరూ సరిగా వినియోగించుకొని.. ఎవరికైనా కుదిరితే వారు కూడా సరైన హాస్పిటల్స్ అందుబాటులోలేనివారి కోసం హెల్త్ క్యాంప్స్ నిర్వహించాలని కోరుతున్నాను. ఈ క్యాంప్ ను ఇంత సక్సెస్ఫుల్ గా నిర్వహించిన “లైఫ్ ఎగైన్” మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు” అన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus