పవన్, త్రివిక్రమ్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అంచనా ఎలా ఉందంటే ..?
- May 30, 2017 / 01:04 PM ISTByFilmy Focus
కాటమరాయుడు తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. . రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో హీరో పవన్, హీరోయిన్లు అను ఇమ్మానియేల్, కీర్తి సురేష్ లపై సరదా సన్నివేశాలను చిత్రికరిస్తున్నారు. జల్సా, అత్తారింటికి దారేది వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పవన్ కళ్యాణ్ చేస్తున్న మూడో సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం చేయనున్న ప్రీ రిలీజ్ బిజినెస్ పై ఇప్పటి నుంచే చర్చలు మొదలు అయ్యాయి. కలక్షన్ లో అత్యంత కీలకమైన నైజాం ఏరియాలో బిజినెస్ 32 కోట్ల వరకు ఉంటుందని, సీడెడ్లో18 కోట్లు, మిగిలిన ఆంద్ర ప్రాంతమంతా కలిపి 45 కోట్లకు పైగానే ఉంటుందని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.
ఇక ఓవర్ సీస్ , ఇతర రాష్ట్రాల్లో రైట్స్ తో కలుపుకుంటే మరో 15 కోట్లు వస్తుంది. సాటిలైట్ రైట్స్ విషయం పక్కన పెట్టినా కేవలం థియేటర్స్ రైట్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ వందకోట్లు చేస్తోంది. సినిమా రిలీజ్ సమయానికి ఈ రేట్లు మరింత పెరగవచ్చు. ఇక మూవీ రిలీజ్ అయిన తర్వాత కలక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అంచనా వేయడం కష్టం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















