స్టార్ హీరోల చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ కథనాలు నిజం కావు
- May 31, 2017 / 01:41 PM ISTByFilmy Focus
స్టార్ హీరోల సినిమాలు సెట్స్ పై ఉండగానే బిజినెస్ మొదలు పెడుతున్నాయి. క్రేజ్ కి తగ్గట్టు బేరసారాలు సాగుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో పవన్, ఎన్టీఆర్, మహేష్ బాబు చిత్రాల గురించి మాట్లాడుకుంటున్నారు. మహేష్ బాబు మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న స్పైడర్ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న మూడో సినిమాపై ఆసక్తి నెలకొని ఉంది. ఇక ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నట విశ్వరూపం చూపించనున్న జై లవకుశ పై విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే వీటి ప్రీ రిలీజ్ బిజినెస్ పై రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. పవన్ మూవీకి 95 కోట్లు, మహేష్ స్పైడర్ కు 77 కోట్లు.. ఎన్టీఆర్ జై లవ కుశకు 69 కోట్లు నిర్మాతలు కోట్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
కొన్ని ఏరియాల్లో థియేటర్స్ రైట్స్ అమ్ముడు పోయినట్లు రూమర్లు వస్తున్నాయి. ఇవన్నీ అవాస్తవాలని సినీ పెద్దలు కొట్టి పడేస్తున్నారు. నిర్మాతలు చెప్పడం, డిస్ట్రిబ్యూటర్లు అడగడం వంటివి జరుగుతున్నా .. ఈ మూడు చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ ఇంకా మొదలు కాలేదని ట్రేడ్ వర్గాల వారు స్పష్టం చేశారు. అనేక సంప్రదింపుల తర్వాత ఈ ధరల్లో చాల మార్పులు ఉంటాయని తెలిపారు. సో అభిమానులు ఈ ఫిగర్స్ చూసి హంగామా చేయవద్దని సూచించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















