‘ఆర్ఆర్ఆర్’.. ‘నాటు నాటు’ ఇప్పుడు ఈ రెండూ పర్రాయ పదాలు అయిపోయాయి. పాన్ ఇండియా సినిమా విడుదలైన ‘ఆర్‌ఆర్ఆర్’ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచనాలు నమోదు చేసింది. ఈ సినిమా గురించి మొన్నటివరకు హీరోలు, దర్శకుడు గురించే మాట్లాడుతున్నారు. అయితే అంతర్జాతీయ పురస్కారాల వేదిక మీద ‘నాటు నాటు..’ పాటకు పురస్కారాలు రావడం, ఆస్కార్ కోసం బరిలో నిలవడంతో ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘నాటు నాటు’ పేర్లే వినిపిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో కొన్ని పేర్లు మిస్ అయ్యాయని గత కొద్ది రోజులుగా విమర్శలు వస్తున్నాయి.
తాజాగా ‘నాటు నాటు’ విషయంలో మరో వ్యక్తి కూడా హర్ట్ అయ్యారు అంటూ వార్తలు మొదలయ్యాయి. అతనే ఆ పాట కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్. ‘నాటు నాటు…’ పాట వినడానికి కంటే చూడటానికే ఎక్కువ బాగుంటుంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులో రామ్‌చరణ్, తారక్ స్టెప్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు పాటకు అంత అప్లాజ్ వచ్చింది అంటే ఆ కొరియోగ్రఫీ కూడా ప్రధాన కారణం.
అయితే పాట గురించి ఎక్కడ ప్రస్తావన వచ్చినా.. రాజమౌళి, కీరవాణి పేర్లు వస్తున్నాయి తప్ప.. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ పేరు రావడం లేదని ఓ విమర్శ ఉంది. పాట రాసిన చంద్రబోస్ పేరు కూడా వినిపిస్తోంది కానీ నిర్మాత పేరు ఎక్కడా వినిపించడం లేదనే పుకారూ ఉంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ పాట విషయంలో ప్రేమ్‌రక్షిత్ మాస్టర్ హర్ట్ అయ్యారని ఆ వార్త సారాంశం. అయితే ఆయన నిజంగానే హర్ట్ అయ్యారా? లేక ఇది ఎవరో పుట్టించిన పుకారా అనేది తెలియడం లేదు.
ఎందుకంటే ఈ పాట గురించి తొలినాళ్లలో ఎక్కడ ప్రస్తావన వచ్చినా, విదేశాల్లో పాటను ఎక్కడ ప్రత్యేకంగా ప్రదర్శించినా ప్రేమ్ రక్షిత్ గురించి రాజమౌళి ప్రత్యేకంగా చెప్పారు. ఇటీవల ఆస్కార్ నామినేషన్ వచ్చినప్పుడు కూడా రాసిన నోట్‌లో నిర్మాత పేరు మరచిపోయారేమో కానీ.. ప్రేమ్‌రక్షిత్ పేరు మరచిపోలేదు. కాబట్టి ప్రేమ్ రక్షిత్ హర్ట్ అయ్యారనే మాట నిజం కాదనే చెప్పాలి.
రైటర్ పద్మభూషణ్ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!
మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!