Premalu Collections: ‘ప్రేమలు’ 11 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • March 19, 2024 / 08:14 PM IST

మలయాళంలో గత నెల అంటే ఫిబ్రవరి 9న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది ‘ప్రేమలు'(Premalu)  మూవీ. గిరీష్.ఎ.డి (Girish A. D.)  డైరెక్ట్ చేసిన ఈ సినిమాని ‘భావన స్టూడియోస్’ బ్యానర్ పై ఫహాద్ ఫాజిల్(Fahadh Faasil), దిలీష్ పోతన్(Dileesh Philip), శ్యామ్ పుష్కరన్ (Syam Pushkaran) .. లు నిర్మించారు.విష్ణు విజయ్ సంగీతం అందించారు. కేవలం రూ.10 కోట్ల బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇది. కానీ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది.

ఈ సినిమాని తెలుగులోకి కూడా డబ్ చేసి మార్చి 8 న శివరాత్రి కానుకగా రిలీజ్ చేశారు. రాజమౌళి  (Rajamouli) కొడుకు కార్తికేయ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సంపాదించుకుంది.’90s'(వెబ్ సిరీస్) దర్శకుడు ఆదిత్య రాసిన డైలాగ్స్ హిలేరియస్ గా అనిపించాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ చాలా బాగా నమోదయ్యాయి. ఒకసారి ‘ప్రేమలు’ 11 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 2.56 cr
సీడెడ్ 0.74 cr
ఆంధ్ర(టోటల్) 1.11 cr
ఏపీ +తెలంగాణ (టోటల్) 4.41 cr

‘ప్రేమలు'(తెలుగు) కేవలం రూ.1.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఈ సినిమా 4 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక 11 రోజులు పూర్తయ్యేసరికి రూ.4.41 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది.రెండో వీకెండ్ కూడా ఈ మూవీ చాలా బాగా క్యాష్ చేసుకుంది. మొత్తంగా ఇప్పటివరకు ఈ సినిమా రూ.2.81 కోట్ల లాభాలను అందించింది.

షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!

‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus