చందు సినిమా చేస్తోంది ఎవరితో.. సక్సెస్ తెచ్చిన తంటా..!

  • October 31, 2016 / 05:47 AM IST

సినిమా ప్లాప్ అయితే ఎన్నో సమస్యలని పరిశ్రమలోని చాలామంది చెప్తుంటారు. అయితే హిట్ పడినా కొన్ని కష్టాలు తప్పవు. అవి ఎలా ఉంటాయన్నది యువ దర్శకుడు చందు మొండేటిని అడిగితే మీకు సరైన సమాధానం దొరకొచ్చు. తొలి సినిమాకే రొటీన్ కి దూరంగా ఉన్న కథని ఎంచుకుని విజయం సాధించడం, ‘ప్రేమమ్’ లాంటి మ్యాజికల్ సినిమాని ఇక్కడి నేటివిటీకి అనుగుణంగా రీమేక్ చేసి మరో మెట్టు పైకెక్కిన చందుతో సినిమా చేసేందుకు కోసం దర్శక నిర్మాతలే కాదు హీరోలు ఎగబడుతున్నారట.

మొన్నటికి మొన్న వరుస విజయాలు చేస్తున్న టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ చందు మొండేటితో సినిమా చేసేందుకు సుముఖంగా ఉన్నట్టు ఫిలిం నగర్ లో వార్తలు చక్కెర్లు కొట్టాయి. ఈ వేడి చల్లారకముందే మరో హీరో పేరు బయటికి వచ్చింది. అది వేరెవరో కాదు మాస్ మహారాజ్ గా పేరొందిన రవితేజ. గతేడాది తెరమీదికొచ్చిన ‘బెంగాల్ టైగర్’ తర్వాత రవితేజ నుండి ఇప్పటివరకు మరో సినిమా రాలేదు. కొన్ని సినిమాలు సెట్స్ కి వెళ్లే దశలో ఆగిపోగా కొన్ని స్క్రిప్ట్ దశలోనే వెనక్కి వెళ్లిపోయాయి. ఇటీవల బాబీతో చేయాల్సిన సినిమా కూడా ఎటూ తేలలేదు. ఈ పరిస్థితుల్లో ప్రామిసింగ్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న చందు మొండేటి రవితేజ కోసం ఓ కథ సిద్ధం చేశారని వినిపిస్తోంది. ఇది ఉత్తుత్తా.. లేక వాస్తవమా అన్నది తెలియాలంటే చందు తన తర్వాతి సినిమాపై నోరు విప్పే వరకు ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus