అక్టోబర్ 7న రిలీజ్ కి సిద్ధమైన చైతూ మూవీ

యువ సామ్రాట్ నాగ చైతన్య నటించిన అందమైన ప్రేమకథా చిత్రం ‘ప్రేమమ్’ సెన్సార్ పనులను మంగళవారం పూర్తి చేసుకుంది. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు ఎటువంటి కట్ చెప్పకుండా యుఏ సర్టిఫికెట్ ని అందించారు.  కార్తికేయ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న చందు మొండేటి దర్శకత్వం వహించిన ఇందులో చైతు ముగ్గురితో ప్రేమలో పడనున్నారు.

ఆ అందమైన అమ్మాయిల పాత్రలను అనుపమ పరమేశ్వరన్, శృతి హాసన్, మడొనా సెబాస్టియన్ పోషించనున్నారు. రాజేష్ మురుగేశన్, పి.సుందర్ లు సంయుక్తంగా స్వరపరిచిన పాటలు యువత మనసును గిలిగింతలు పెట్టాయి. కొన్ని రోజుల క్రితం విడుదలైన  ప్రేమమ్ ట్రైలర్ కి విశేష స్పందన లభించింది. వేగంగా పది లక్షల వ్యూస్ మార్క్ ని దాటేసింది. కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ సినిమా అక్టోబర్ 7న రిలీజ్ కానుంది.

Premam Theatrical Trailer || Naga Chaitanya, Shruti Haasan - Filmyfocus.com

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus