ఆగస్టు 7 న ప్రేమమ్ ఆడియో రిలీజ్

  • June 29, 2016 / 06:23 AM IST

యువ సామ్రాట్ నాగ చైతన్య టీనేజ్ బాయ్ గా, కాలేజీ కుర్రోడిగా, మధ్య వయసు వ్యక్తిగా నటిస్తున్న చిత్రం ప్రేమమ్. మలయాళంలో సూపర్ హిట్ గా నిల్చిన ప్రేమమ్ మూవీని అదే పేరుతో తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాధాకృష్ణ, సూర్యదేవర నాగ వంశీ, ప్రసాద్ నిర్మిస్తున్నారు. చందూ మొండెటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ లు కథానాయికలుగా నటిస్తున్నారు.

ప్రత్యేక పాత్రలో విక్టరీ వెంకటేష్ కనిపించనున్నారు. ఊపిరి సినిమాకు తన సంగీతంతో ప్రాణం పోసిన గోపి సుందర్ ప్రేమమ్ కు మ్యూజిక్ అందిస్తున్నారు. యువతను ఆకట్టుకొనేలా స్వరపరిచిన ప్రేమమ్ ఆడియోను ఆగస్టు 7 న రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం భావిస్తోంది. హైదరాబాద్ లోని ప్రముఖ వేదికపై పాటలను ఆవిష్కరించనున్నారు. చైతూకి ఈ సినిమా ఏ మాయ చేసావే వంటి గొప్ప విజయాన్ని అందిస్తుందని చిత్రబృందం ధీమా గా ఉంది. ఆగస్టు ఆఖరివారంలో చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus