‘పేపర్ బాయ్’ వంటి మంచి ఫీల్ గుడ్ మూవీని తెరకెక్కించిన జయశంకర్.. రెండో ప్రయత్నంగా ‘అరి’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ట్రైలర్ ఆల్రెడీ రిలీజ్ అయ్యి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అంతకు ముందు రిలీజ్ చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ కూడా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. మంగ్లీ పాడిన ‘చిన్నారి కిట్టయ్య’ సాంగ్ కూడా బాగా ట్రెండ్ అయ్యింది. ఆర్.వి.రెడ్డి సమర్పణలో శేషు మారం రెడ్డి, శ్రీనివాస రామిరెడ్డి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. తాజాగా ‘అరి’ చిత్రం ట్రైలర్ కు ఓ అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్నెస్(ఇస్కాన్).. బెంగళూరు ప్రెసిడెంట్ అయిన మధు పండిట్ దాస.. ఈ చిత్రం పై ప్రశంసలు కురిపించారు. శ్రీకృష్ణుడి జీవితానికి సంబంధించిన థీమ్ తో ఈ చిత్రాన్ని రూపొందించడం పై దర్శకుడు జయశంకర్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
అంతకు ముందు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్, నిర్మాత అశ్వినీదత్ వంటి వారు కూడా ‘అరి’ చిత్రం పై ప్రశంసలు కురిపించారు. ‘అరిషడ్వర్గాలోని కామ.. క్రోధ.. లోభ.. మోహ.. మద.. మాత్సర్యాల’ చుట్టూ తిరిగే కథ ఇదని ట్రైలర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.
‘మనిషి ఎలా బతక్కూడదు’ అనే అంశాన్ని ఈ సినిమాలో ఓ కొత్త కోణంలో చూపించినట్టు కూడా స్పష్టమవుతుంది. ‘అరి’షడ్వర్గాలు ఉన్న ఆరుగురు శత్రువులతో ఓ ఎయిర్ హోస్టెస్ ఎలాంటి పోరాటాన్ని సాగించిందనే ఆసక్తికరమైన కథనంతో ఈ (Ari) మూవీ రూపొందింది. రిలీజ్ కు ముందే ఈ చిత్రం పై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?