సినిమా కోసం ఎన్ని కష్టాలైనా పడినవాళ్లే స్టార్ హీరో అవుతారు అంటారు. గతంలో చాలామంది ఇలా చేసి చూపించారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. వన్స్ స్టార్ అయ్యాక కూడా దాన్ని కొనసాగిస్తే సూపర్ స్టార్ అంటారు. అలాంటి వాళ్లలో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఒకరు. సినిమా అంటే ఆయనకు ఓ ఊపు వచ్చేస్తుంది. దాని కోసం ఏళ్ల తరబడి కష్టపడటానికి ఆయన ఎప్పుడూ సిద్ధమే. సరైన తిండి, కంటి నిండా నిద్ర లేకుండా సినిమా చేసేయమన్నా ఆయన చేసేస్తారు అంటారు. అలా ఇప్పుడు ఆయన చేసిన సినిమా ‘ది గోట్ లైఫ్’(The Goat Life).
కథ, పాత్ర కోసం తమను తాము మార్చుకునే అతికొద్ది మందిలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒకరు. ఆయన ప్రధాన పాత్రలో బ్లెస్సీ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘ఆడు జీవితం: ది గోట్ లైఫ్’. సుదీర్ఘ కాలం చితరీకరణ చేసుకున్న ఈ సినిమా మార్చి 28న విడుదలవుతోంది. మలయాళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమనాఉ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా గురించి ఆసక్తికర విషయాలను ఆయన ఇటీవల వెల్లడించారు. అవి వింటుంటే… ఓ సినిమా కోసం ఇంత కష్టపడతారా అని అనిపించకమానదు.
ఎడారిలో దారి తప్పిపోయి ఆకలితో అలమటించే వ్యక్తిగా కనిపించాలని దర్శకుడు చెప్పారట. దీంతో పృథ్వీరాజ్ భోజనం మానేయాలనుకున్నారట. ఆహారం కోసం రోజుల పాటు వేచి చూసిన వ్యక్తి ఎలా కనిపిస్తాడో అలాగే కనపడాలనుకున్నారట. దీంతో ఎక్కువ సమయం ఉపవాసం ఉన్నారట. కొన్నిసార్లు 72 గంటల పాటు కేవలం మంచి నీళ్లు, కొద్దిగా బ్లాక్ కాఫీ తీసుకునేవాడట. శారీరకంగా అనుకున్న మార్పు రావాలంటే కేవలం ఆహారం మానేస్తే సరిపోదని తర్వాత అనిపించిందట.
అందుకు మానసికంగానూ సిద్ధంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. శరీరం రెండు, మూడు రోజులు పాటు ఆహారం తీసుకోకపోయినా నిలబడుతుందని, అయితే ఏదైనా తినమని మెదడు చెబుతుందని పృథ్వీరాజ్ అన్నారు. అదే అసలైన ఛాలెంజ్ అని కూడా చెప్పారు. అలా ఈ సినిమా కోసం ఏకంగా 31 కేజీలు తగ్గిపోయారట.
విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?