Prithviraj, Prabhas: ప్రభాస్ మంచి తనం పై పృథ్వీ రాజ్ కామెంట్స్ వైరల్!

ప్రభాస్ నటించిన సలార్ సినిమా మరి కొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 22వ తేదీ విడుదల కాబోతుంది ఇక ఈ సినిమాలో ప్రభాస్ స్నేహితుడి పాత్రలో నటుడు పృథ్వీ రాజ్ నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 22వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం రాజమౌళితో కలిసి ఇంటర్వ్యూ చేసినటువంటి వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ప్రభాస్ గురించి ఆయన మంచితనం గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు తను ఫుడ్ పంపితే నేను మరొక రూం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన ఫుడ్ విషయంలో అంతగా అందరి పట్ల ప్రేమ చూపిస్తారు అంటూ కామెంట్ చేశారు అయితే ఒక రోజు ఇలా మాట వరసగా మాట్లాడుతూ నాకు కార్లు అంటే చాలా ఇష్టం అనే విషయాన్ని వెల్లడించాలని పృథ్వీ రాజ్ తెలిపారు.

ఈ విధంగా నాకు కార్లు అంటే ఇష్టం అనే విషయాన్ని అందరితో మాట్లాడుతూ బయట పెట్టడంతో వెంటనే ప్రభాస్ తన లంబోర్ఘిని కారును నాకు ఇచ్చేసి నేను అక్కడ ఉన్నని రోజులు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఈ కారు వాడొచ్చు అంటూ ఈయన తన కారు తాళాలు నాకు ఇచ్చారు అంటూ తెలియజేశారు. ఇక ప్రభాస్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాకు నలభై ఐదు రోజులు అంటేనే తాను నాగ్ అశ్విన్ ను ఒప్పించి ఈ సినిమాకు కమిట్ అయినట్లు తెలియజేశారు.

తన ఏ సినిమా అయినా మూడు సంవత్సరాలు పాటు సమయం పడుతుంది. అలాంటిది ప్రశాంత్ నీల్‌తో సినిమాను చేయను అని నో చెబితే ఫ్యాన్స్ చంపేస్తారని అనుకున్నాడట. అందుకే ఎలాగైనా సరే నాగ్ అశ్విన్‌ను ఒప్పించి.. డేట్లు అడ్జస్ట్ చేసి సలార్‌కు ఓకే చెప్పానని ప్రభాస్ అన్నాడు. ఇక చాలామంది తనతో మాట్లాడుతూ బాహుబలి సినిమా చేసిన తర్వాత కేజిఎఫ్ సినిమా చేసి ఉంటే బాగుండేదని సలహాలు ఇచ్చారు. బాహుబలి కంటే కేజీయఫ్ గురించి ఎక్కువగా తనతో మాట్లాడారంటూ (Prabhas) ప్రభాస్ చెప్పుకొచ్చాడు.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus