SSMB29: విలన్ గురించి విన్నారా?

ఎస్ ఎస్ ఎంబీ 29 (SSMB29) షూటింగ్ ప్రస్తుతం హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా సాగుతోంది. మ‌హేష్ బాబు (Mahesh Babu)  రాజ‌మౌళి (S. S. Rajamouli) కాంబినేషన్‌పై ఉన్న అంచ‌నాల దృష్ట్యా, సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌కు క్రేజ్ పెరుగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. మూడో షెడ్యూల్‌కి రంగం సిద్ధమవుతోంది. అడ్వెంచర్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌కి సంబందించిన ఆసక్తికర సమాచారం ఇప్పుడు బయటకు వచ్చింది. ఇప్పటివరకూ ఈ సినిమాలో విలన్ పాత్రను మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్నారని తెలుస్తోంది.

SSMB29

కానీ తాజా సమాచారం ప్రకారం, పృథ్వీరాజ్ (Prithviraj Sukumaran)  పాత్ర అసలైన ప్రతినాయకుడు కాదని, ఆయన వెనుక ఇంకా ఓ మేజర్ విలన్ ఉంటాడని తెలుస్తోంది. అదే కాదు, ఈ పాత్ర కోసం ఓ హాలీవుడ్ నల్లజాతీయ నటుడిని ఎంపిక చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో బలమైన సమాచారం వినిపిస్తోంది. గ్లోబల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ కథలో, ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో నడిచే సీన్స్‌కు తగ్గట్టుగా ఆ ప్రాంతానికి చెందిన పాత్రలను తీసుకురావాలన్నది జక్కన్న ప్లాన్ అని అంటున్నారు. ఇది రాజమౌళి సినిమాకు సరిపోయే స్థాయిలో ఉండాలన్న ఉద్దేశంతో, ప్రముఖ విదేశీ నటుడిని ఈ పాత్ర కోసం తీసుకుంటున్నారని తెలుస్తోంది.

ఇది బాహుబలి (Baahubali) సిరీస్‌లో ప్రభాకర్ కాలకేయ (Kalakeya Prabhakar ) పాత్రకు వచ్చిన క్రేజ్‌ను మించినదే అవుతుందని భావిస్తున్నారు. అలాగే ‘ఆర్‌ఆర్‌ఆర్’లోనూ (RRR) అసలైన విలన్స్ ఎవరో సినిమా విడుదలయ్యే వరకు బయటపెట్టలేదు. ఇప్పుడు ‘SSMB29’ విషయంలోనూ అదే రూట్ తీసుకున్నట్టున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో మ‌హేష్ పాత్ర చాలా స్టైలిష్‌గానూ, ఫిజిక‌ల్‌గానూ చాలానే ట్రాన్స్‌ఫామ్ అయిందని లీకులు వచ్చాయి. అదే విధంగా ప్రియాంక చోప్రా (Priyanka Chopra)  కథానాయికగా నటించనుండగా, పృథ్వీరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

కానీ అసలైన టర్నింగ్ పాయింట్ అయితే ఈ కొత్త విలన్ పాత్రనే కానుందని టాక్. రాజమౌళి తన సినిమాల్లో ప్రతినాయకుడిని ఎలా డిజైన్ చేస్తాడో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాలో విలన్ పాత్రను ఎవరు పోషించబోతున్నారు? నిజంగా ఓ హాలీవుడ్ నటుడేనా? అనే ఉత్కంఠ అభిమానుల మధ్య తారాస్థాయిలో పెరిగిపోతోంది. జక్కన్న స్టైల్లో ఫైనల్ అప్డేట్ వచ్చేంతవరకూ ఈ మిస్టరీ కొనసాగడం ఖాయం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus