Prithviraj: దేవర సినిమాకు పోటీగా పృథ్వీరాజ్ సినిమా.. హిట్టవుతుందా?

ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సలార్ సినిమాలో వరద రాజమన్నార్ పాత్రలో నటించి పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంతగానో ఆకట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పృథ్వీరాజ్ సుకుమారన్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. పృథ్వీరాజ్ సుకుమారన్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. దేవర సినిమా ఏప్రిల్ నెల 5వ తేదీన విడుదల కానుండగా ఈ సినిమాకు పోటీగా పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమా ఏప్రిల్ నెల 10వ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది.

ది గోట్ లైఫ్ అనే వెరైటీ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రభాస్ రిలీజ్ చేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది. ఏప్రిల్ నెలలో కంగువా, ఇండియన్2 సినిమాలు సైతం రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. సినీ అభిమానులకు ఏప్రిల్ నెల స్పెషల్ గా నిలవనుందని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.

సమ్మర్ సమయానికి మరికొన్ని సినిమాలు సైతం రేసులో నిలిచే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది. 2024 సంవత్సరం టాలీవుడ్ సినీ అభిమానులకు స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తోంది. దేవర సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటం గమనార్హం. ఈ గ్లింప్స్ కు 32 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దేవర సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు స్పెషల్ గా ఉండనున్నాయని సమాచారం అందుతోంది.

అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా దేవర మూవీని ప్లాన్ చేశారని భోగట్టా. దేవర సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దేవర సినిమా హాలీవుడ్ లెవెల్ లో తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ సినిమా మ్యూజిక్, బీజీఎం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus