నువ్వంటే నాకు చాలా ఇష్టం : ప్రియా ప్రకాష్‌

ఒక్కసారి కన్ను గీటి ఇండియా వైడ్ వైరల్ అయిపొయింది ప్రియా ప్రకాష్ వారియర్. ఈమెకు అంత క్రేజ్ రావడంతో ఆమె కన్నుగొట్టిన ‘ఒరు అడార్ లవ్’ చిత్రాన్ని తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో విడుదల చేసారు. అయితే ఆ చిత్రం ప్లాపయిందనుకోండి..! కానీ ఆ సినిమాకి ముందు టాలీవుడ్ నుండీ కూడా ఆమెను వెతుక్కుంటూ అనేక ఆఫర్లు వచ్చాయి. కానీ వాటిని ఆమె రిజెక్ట్ చేసింది… ఇక సినిమా విడుదలై ప్లాప్ టాక్ వచ్చిన తరువాత ‘ఆమె నో అనడమే’ మంచిదైందని నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు.’లవర్స్ డే’ చిత్రం ప్లాపయ్యాక ఈమె ఎక్కడా అడ్రెస్ లేదు. కానీ సడెన్ గా మన విజయ దేవరకొండ పక్కన కనిపించి అందరికీ షాకిచ్చింది.

అవును తాజాగా విజయ్ దేవరకొండ ను కలిసింది ప్రియా ప్రకాష్. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోని ప్రియా ప్రకాష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోకి ‘నువ్వంటే నాకు చాలా ఇష్టం’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు క్రేజీ సెలబ్రిటీలు కలిసి తీసుకున్న ఫోటో ఆ మాత్రం వైరల్ అవ్వడం కామన్. అంతేకాదు ఈ ఫోటో పై రకరకాల కథనాలు పుట్టుకొచ్చేస్తున్నాయి. అందులో వీరిద్దరూ కలిసి ఏమైనా సినిమా చేస్తున్నారా అనే కామెంట్ కూడా ఉంది. ఇది పక్కన పెడితే ‘నువ్వంటే నాకు చాలా ఇష్టం’ అని ప్రియా ప్రకాష్ కామెంట్ చేయడంతో.. ‘కొంపతీసి వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారా’ అని కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రియా ప్రకాష్ అలా ఎందుకు కామెంట్ చేసిందో క్లారిటీ ఇస్తే గానీ ఈ కామెంట్స్ ఆగేలా లేవు.

1

2

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus