ప్రియా ప్రకాష్ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుంది..?

ఒక్కసారి కన్ను కొట్టి రాత్రికి రాత్రి క్రేజీ భామగా మారిపోయింది ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. అంతేకాదు కుర్రాళ్ళ హృదయాలను సైతం కొల్లగొట్టేసింది ఈ భామ. మలయాళ చిత్రమైన ‘ఒరు ఆధార్‌ లవ్‌’ టీజర్‌ సోషల్ మీడియాలో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో కూడా ఆమె అందరికీ తెగ నచ్చేసింది. దీంతో చాలా మంది తమ సినిమాల్లో ప్రియా ప్రకాష్ ను హీరోయిన్ గా తీసుకోవాలని ఆమెను సంప్రదించారు కూడా..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చిత్రంలో కూడా ఓ పాత్ర కోసం ప్రియా ప్రకాష్ ని సంప్రదించారట. అయితే అది హీరోయిన్ పాత్రకాదని… అందులోనూ కోటి రూపాయలు రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో ఆ చిత్ర మేకర్స్ నిరాకరించారట. ఓ కొత్త అమ్మాయి కి అంత పెద్ద మొత్తం అంత అవసరమా అని భావించారట. దీంతో వాళ్ళంతా ‘లవర్స్‌ డే’రిలీజ్ అయ్యాక …దాని రిజల్ట్ ని బట్టి తమ సినిమాల్లోకి తీసుకుందామా… వద్దా.. అని వెయిట్ చేసారట. తీరా సినిమా విడుదలయ్యి డిజాస్టర్ అయయక… తెలుగులో అడిగేవాళ్ళే లేని పరిస్దితి ఏర్పడిందట.

చివరికి … ఆమె గొయ్యి ఆమే తీసుకున్నట్లు అయ్యింది. రోషన్, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ నటించిన మలయాళ చిత్రం ‘ఒరు ఆధార్‌ లవ్‌’ చిత్రాన్ని ఒమర్‌ లులు డైరెక్ట్ చేసాడు. ‘సుఖీభవ సినిమాస్‌’ పతాకంపై ఎ.గురురాజ్, సి.హెచ్‌. వినోద్‌ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో ‘లవర్స్‌ డే’ పేరుతో ఫిబ్రవరి 14న పేమికుల దినోత్సవం సందర్బంగా విడుదల చేసారు. ప్రియా ప్రకాష్ కు పెద్ద మార్కులు పడలేదు. క్యూట్ గా ఉంది కానీ నటన అంతంత మాత్రమే అని తేల్చేసారు మన ప్రేక్షకులు. దీంతో ప్రియా ప్రకాష్ పరిస్థితి మొగ్గలోనే రాలిపోయినట్టయ్యింది. ఒకవేళ అంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేయకుండా ఉంటే కనీసం ఇప్పుడు 3,4 సినిమాలైనా ఈ అమ్మడి చేతిలో ఉండేవేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus