రివ్యూల బ్యాన్ గురించి ప్రియదర్శి, నాని కామెంట్స్!

రివ్యూల గురించి ఇటీవల విజయశాంతి  (Vijaya Shanthi) , సంపత్ నంది (Sampath Nandi) వంటి స్టార్లు మండిపడటం అనేది మనం చూశాం. ముఖ్యంగా సినిమాలు ఆడకపోతే ‘రివ్యూలే కారణం’ అంటూ అంతా అభిప్రాయపడుతున్నారు. దీంతో సినిమా రిలీజ్ అయిన 2 రోజుల వరకు రివ్యూలు బ్యాన్ చేయాలనే నిర్ణయానికి ఛాంబర్ వచ్చేసింది. కానీ ఫైనల్ డెసిషన్ అయితే తీసుకోలేదు. మరి సినిమా వాళ్ళు దీనిపై ఎలా ఫీలవుతున్నారు? అనే చర్చ కూడా నడుస్తోంది. ఈ క్రమంలో ‘కోర్ట్’ (Court) హీరో ప్రియదర్శి, ఆ సినిమా నిర్మాత నాని  (Nani)  స్పందించి తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు.

Priyadarshi, Nani

ముందుగా ‘సారంగపాణి జాతకం’ (Sarangapani Jathakam) సినిమా ప్రమోషన్స్ లో ప్రియదర్శి (Priyadarshi) రివ్యూల బ్యాన్ గురించి మాట్లాడుతూ… ” రివ్యూలను ఆపేయమని డిమాండ్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ‘ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్’ అనేది అందరి హక్కు. నా ‘బలగం’ (Balagam) సినిమాకి మంచి రివ్యూలు వచ్చాయి. అది బాగా ఆడింది. తర్వాత ‘డార్లింగ్’ (Darling) బాలేదు అని రాశారు. అది ఆడలేదు. అందుకు నేనేమీ ఫీల్ అవ్వలేదు. అలాగే ‘కోర్ట్’ బాగుంది అని రాశారు. అది మంచి విజయం సాధించింది.

‘సారంగపాణి జాతకం’ కి ఎలాంటి రివ్యూలు వచ్చినా నేను స్వాగతిస్తాను. కానీ నేను కోరుకునేది ఒక్కటే. రివ్యూ చెబుతున్నప్పుడు బాషని కంట్రోల్లో పెట్టుకుని చెబితే బెటర్. ఫార్మల్ వేలో కూడా రివ్యూలు చెప్పొచ్చు కదా. ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే రైటర్స్ కి, ప్రొడ్యూసర్స్ కి బాధ కలుగుతుంది. అప్పుడు వాళ్ళు నెక్స్ట్ ప్రాజెక్టు చేసే ముందు ఇబ్బంది పడతారు. అది గుర్తుపెట్టుకోవాలి అంతే..!” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక ‘హిట్ 3’ (HIT 3) సినిమా ప్రమోషన్స్ లో రివ్యూల బ్యాన్ గురించి నాని మాట్లాడుతూ.. ” ఎందుకు రివ్యూలు చెప్పడం ఆపేస్తారు? ఎందుకు ఆపేయాలి? రివ్యూలు చెప్పడం ఆపేయండి అనడం కరెక్ట్ కాదు. కానీ పలనా సినిమా బాలేదు.. అందుకు ఆ యాక్టర్ బాగా చేయలేదు, హీరోయిన్ బాగా చేయలేదు అనే బదులు… మాకు అవి నచ్చలేదు అని చెప్పండి. ఈ మధ్య సోషల్ మీడియాలో చూసేది ఏంటంటే..

‘సినిమా డిజాస్టర్’ అని మొదటి షోకే చెప్పేస్తున్నారు. అలా చెప్పకండి. వారం రోజుల తర్వాత దాని కలెక్షన్స్ అవి బాలేదు, జనాలు వెళ్లడం లేదు అంటే అప్పుడు డిజాస్టర్ అని చెప్పండి. అప్పటి వరకు సినిమాని బ్రతకనివ్వండి. సోషల్ మీడియాలో జనాలు ఎలా మాట్లాడినా పర్వాలేదు. కానీ మీడియాలో ఉండే వాళ్ళు కూడా ఇలా రివ్యూలు చెప్పడం అనేది బాధపెడుతుంది” అంటూ చెప్పుకొచ్చాడు.

‘యూవీ’ వాళ్ళ ముందు చూపు బానే ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus