Priyadarshi: మళ్లీ హిట్‌ కాన్సెప్ట్‌ ప్లాన్‌ చేస్తున్న ఇంద్రగంటి… ఈసారి హీరో ఎవరంటే?

తెలుగు సినిమాల్లో ఇంద్రగంటి స్కూలు వేరు. ఆయన సినిమాలకు కల్ట్‌ ఫ్యాన్స్‌ చాలామంది ఉన్నారు. అయితే ఆయన ప్రయత్నాలు అన్నీ సఫలం అవ్వడం లేదు. అయితే ఒక్కసారి కనెక్ట్‌ అయ్యిందా? ఇక జనాలు తెగ చూసేస్తుంటారు. అయితే ఆయన గత రెండు సినిమాలకు సరైన విజయం దక్కలేదు. ఈ ప్రయత్నంలో ఓ పెద్ద హీరోతో సినిమా చేస్తారు అని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఆ సినిమాను పక్కనపెట్టి చిన్న హీరోతో ఓ సినిమా చేయాలని ఆయన ఫిక్స్‌ అయ్యారట.

‘బలగం’ సినిమాతో ప్రామిసింగ్‌ హీరో అనిపించుకున్న ప్రియదర్శితో… ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమా చేస్తున్నారు అని అంటున్నారు. కమెడియన్‌గా మంచి సినిమాలు చేస్తున్న ప్రియదర్శి ఈ మధ్య హీరోగానూ మంచి సినిమాలే చేస్తున్నాడు. ఇంద్రగంటితో ‘జెంటిల్‌మన్’ సినిమాను నిర్మించిన సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఈ కొత్త సినిమాను నిర్మిస్తారట. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా ఫేమ్ రూప కొడవయూర్ ఈ సినిమాలో ప్రియదర్శికి జోడీగా నటించబోతున్నారట.

‘బలగం’ సినిమా తర్వాత ప్రియదర్శికి మంచి డిమాండ్‌ ఏర్పడింది. త్వరలో ‘ఓం భీం బుష్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అయితే ‘వి’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అంటూ రెండు వరుస వైఫల్యాలు అందుకున్న ఇంద్రగంటి ఈ సినిమాతో ఏ మేర రాణిస్తారో చూడాలి. ‘గ్రహణం’, ‘అష్టాచెమ్మా’, ‘అమీతుమీ’, ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ లాంటి సినిమాలు ఆయన నుండే వచ్చిన విషయం మరచిపోకూడదు.

‘జటాయు’ పేరుతో దిల్ రాజు బ్యానర్‌లో ఇంద్రగంటి భారీ చిత్రం చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఈ మేరకు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా ప్రారంభించారు అని దిల్‌ రాజు చెప్పారు. అయితే ఇప్పుడు ఇంద్రగంటి కొత్త సినిమా ప్రియదర్శితో అని అంటన్నారు. మరి ఆ పెద్ద సినిమా ఉందా? లేక లేదా? అనే విషయంలో క్లారిటీ రావడం లేదు. ఇక (Priyadarshi) ప్రియదర్శి సినిమా ఫ్యామిలీ బేస్డ్‌ వినోదాత్మక చిత్రం అని చెబుతున్నారు. త్వరలో క్లారిటీ వచ్చేస్తుంది.

ఆపరేషన్ వాలెంటైన్ సినిమా రివ్యూ & రేటింగ్!

భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
చారి 111 సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus