Priyamani: ప్రియమణి కోరిక తీర్చబోతున్న స్టార్ హీరో!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి ప్రియమణి ప్రస్తుతం వరస సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తే కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈమె కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి కెరియర్ పరంగా బిజీగా మారిపోయారు. స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తున్నటువంటి ప్రియమణి తాజాగా షారుఖ్ ఖాన్ సినిమాలో కూడా నటించడం సంగతి తెలిసిందే.

ఇలా షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె పుష్ప 2 సినిమాలో కూడా నటిస్తుంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు పై స్పందించి ఈమె క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ప్రియమణి (Priyamani) మరోసారి ఈ విషయం గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పుష్ప 2 సినిమాలో నేను నటిస్తున్నాను అంటూ వస్తున్నటువంటి వార్తలలో నిజం లేదని తెలిపారు అయితే ఎప్పటి నుంచో నాకు అల్లు అర్జున్ సినిమాలో నటించాలి అనే కోరిక ఉందని తెలిపారు. అలాంటి అవకాశం వస్తే నేను అసలు వదులుకోనని తప్పకుండా అల్లు అర్జున్ సినిమాలో నటిస్తానని ఈమె తెలియజేశారు అయితే ఒక వేడుకలో భాగంగా అల్లు అర్జున్ కలిసినప్పుడు ఆయన మీ కోరిక తొందరలోనే తీరుతుంది అంటూ నాకు మాట ఇచ్చారని తెలిపారు.

అల్లు అర్జున్ సినిమాలో నటించాలని నా కోరిక త్వరలోనే తీరబోతుంది అంటే ఆయన సినిమాలో నాకు తప్పకుండా అవకాశం ఇస్తారని ఆయన మాట ఇచ్చారంటే కచ్చితంగా ఆ మాట నిలబెట్టుకుంటారు అంటూ ప్రియమని ఓ సందర్భంలో అల్లు అర్జున్ సినిమాలలో అవకాశం గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus