Priyamani: ఆ హీరోపై ప్రియమణి సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

సౌత్ ఇండియా లో అందం తో పాటు డ్యాన్స్ మరియు అద్భుతమైన నటన ఈ మూడు ఒక ప్యాకేజిలాగా ఉండే హీరోయిన్ దొరకడం చాలా కష్టం. కేవలం కొంతమంది మాత్రమే అలాంటి హీరోయిన్స్ ఉన్నారు. ఆ కొంతమందిలో ఒకరు ప్రియమణి. ఈమెకి జాతీయ అవార్డు కూడా దక్కింది. తెలుగు , తమిళ, హిందీ మరియు మలయాళం భాషల్లో ఉన్న స్టార్ హీరోలందరి సరసన ఈమె హీరోయిన్ గా నటించింది. ఆమెతో పాటు కెరీర్ ని ప్రారంభించిన ఎంతో మంది హీరోయిన్లు ఫేడ్ అవుట్ అవ్వగా, ఈమె మాత్రం ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉంది.

రీసెంట్ గానే ఈమె షారుఖ్ ఖాన్ ‘జవాన్’ చిత్రం లో కూడా ఒక పవర్ ఫుల్ రోల్ చేసింది. అలాగే ఎన్నో క్రేజీ మూవీస్ లో ఈమె ముఖ్య పాత్రలు పోషిస్తూ ఇప్పటికీ మంచి డిమాండ్ ఉన్న ఆర్టిస్టుగా కొనసాగుతుంది. ఇది ఇలా ఉండగా ప్రియమణి 2017 వ సంవత్సరం లో ముస్తఫా రాజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరి దాంపత్య జీవితం ఎంతో అన్యోయంగా సాగుతుంది.

అయితే ప్రియమణి కి మొదటి నుండి ఒక స్టార్ హీరో అంటే విపరీతమైన ఇష్టం ఉండేది అట. ఆ స్టార్ హీరో మరెవరో కాదు షారుఖ్ ఖాన్. ఈయన అంటే ఈమెకి పెద్ద క్రష్ అట , రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో స్వయంగా ఆమెనే ఇది చెప్పింది. చేసుకుంటే షారుఖ్ ఖాన్ ని పెళ్లి చేసుకోవాలి అని కలలు కనేది అట. కానీ దేవుడు వీళ్లిద్దరికీ మరో తలరాత రాసాడు.

అయితే (Priyamani) ప్రియమణి కి షారుఖ్ ఖాన్ తో ఇప్పటికీ మంచి సాన్నిహిత్యం ఉంది. గతం లో చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రం లో ఒక ఐటెం సాంగ్ చేసిన ప్రియమణి, జవాన్ చిత్రం లో ముఖ్య పాత్ర పోషించింది. ఈ రెండు సినిమాలు కూడా షారుఖ్ ఖాన్ కెరీర్ లో సంచలన విజయాలుగా నమోదు అయ్యాయి.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus