Priyamani: ప్రియమణి వివాహం చెల్లదన్న ముస్తఫా భార్య!
- July 22, 2021 / 03:30 PM ISTByFilmy Focus
స్టార్ హీరోయిన్ ప్రియమణి తెలుగుతో పాటు ఇతర భాషల్లో నటిగా మంచి పేరును సంపాదించుకున్నారు. నటిగా ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలోనే ప్రియమణి ముస్తఫా రాజ్ ను వివాహం చేసుకున్నారు. అయితే ముస్తఫా మొదటి భార్య అయేషా మాత్రం ప్రియమణి, ముస్తఫాల వివాహం చెల్లదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ ఛానల్ కథనం ప్రకారం ముస్తఫాకు మొదటి భార్యతో చట్టపరమైన సమస్యలు ఉన్నాయని తెలుస్తోంది. అయేషా ముస్తఫా, ప్రియమణిపై క్రిమినల్ కేసులు పెట్టానని చెప్పినట్టు సమాచారం.
కోర్టులో ఆ కేసు నడుస్తోందని తెలుస్తోంది. గతంలో అయేషా ముస్తఫా రాజ్ పై గృహ హింస కేసును నమోదు చేశారని అయేషాకు ఇద్దరు పిల్లలు కుడా ఉన్నారని సమాచారం. అయితే ముస్తఫా రాజ్ కు దూరంగా ఉన్నప్పటికీ అతనితో తాను విడాకులు తీసుకోలేదని అయేషా చెప్పినట్టు తెలుస్తోంది.కోర్టులో తనకు సెకండ్ మ్యారేజ్ కాలేదని ముస్తఫా రాజ్ చెబుతున్నాడని అయేషా సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం. అయితే ముస్తఫా రాజ్ మాత్రం పిల్లల పోషణ కొరకు ప్రతి నెలా డబ్బులు పంపిస్తున్నానని తనపై చట్టబద్ధమైన చర్యలు తీసుకున్నానని అయేషా చెప్పిన మాటలు నిజం కాదని చెప్పుకొచ్చారు.

2013లోనే తాను అయేషాతో విడాకులు తీసుకున్నానని డబ్బులు వసూలు చేయాలనే ఉద్దేశంతో అయేషా ఈ ఆరోపణలు చేస్తోందని ముస్తఫా రాజ్ అన్నారు. ఈ వివాదంపై ప్రియమణి ఏమని స్పందిస్తారో చూడాల్సి ఉంది. వరుస ఆఫర్లతో ప్రియమణి బిజీగా ఉన్న సమయంలో ముస్తఫా రాజ్ మొదటి భార్య వల్ల ప్రియమణికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
Most Recommended Video
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!













