Priyanka Chopra: నాన్న చివరి రోజుల్లో కూడా చూసుకోలేకపోయా.. స్టార్‌ హీరోయిన్‌ ఆవేదన

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా.. జీవిత ప్రయాణం ఎందరిక స్ఫూర్తిదాయకం. ఒకప్పుడు మేనిఛాయ కారణంగా ఎన్నో అవమానాలు పడిన ఆమె.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి ఫేవరెట్‌ హీరోయిన్‌ అయింది. దేశ, విదేశాల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అయితే దీని వెనుక ఎన్నో కష్టాలు, అవమానాలు, నిద్రలేని రాత్రులు, కన్నవారికి దూరంగా ఉండటం లాంటివి ఉన్నాయి. వాటి గురించి ప్రియాంక ఇటీవల మాట్లాడింది. హీరోయిన్‌గా బిజీగా ఉన్న సమయంలో పడిన కష్టాలు, ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులు గురించి మాట్లాడింది.

Priyanka Chopra

ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలాంటి కథలు ఎంచుకోవాలో తెలియలేదు. వచ్చిన ప్రతి ప్రాజెక్ట్‌ను ఓకే చేస్తూ వచ్చాను. ఎందుకంటే అప్పుడు అవకాశాలు రావడమే అదృష్టమని అనుకునేదానిని. 20 ఏళ్ల వయసులో ఖాళీ లేకుండా సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. అదే చేసి చూపించాను. అప్పుడు నేనెంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. నా పుట్టిన రోజులు మిస్‌ అయ్యాను. పండగలు, పర్వదినాలు సెలబ్రేట్‌ చేసుకోలేదు. నా కుటుంబంతో గడిపిన సందర్భాలూ తక్కువే అని చెప్పింది ప్రియాంక.

ఆ రోజుల్లో అంత కష్టపడ్డాను కాబట్టే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. 20 ఏళ్లు త్యాగం చేశాను కాబట్టే ఇప్పుడు నేడు ఇలా ఉన్నాను. ఇంకా చెప్పాలంటే నా తండ్రి ఆసుపత్రిలో ఉంటే ఆయన చివరి రోజులలో కూడా చూసుకోలేకపోయాను అని ఎమోషనల్ అయింది ప్రియాంక చోప్రా. అయితే ఇప్పుడు కథల ఎంపిక విషయంలో సెలక్టివ్‌గా ఉంటున్నానని, జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తూ సినిమాలు చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది ప్రియాంక.

ప్రస్తుతం ప్రియాంక.. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌ బాబు నటిస్తున్న ‘వారణాసి’ సినిమాలో నటిస్తోంది. ఇందులో ఆమె మందాకినిగా కనిపించనుంది. అలాగే నాగ్‌ అశ్విన్‌ – ప్రభాస్‌ కాంబినేషన్‌లో ప్రారంభం కానున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమా సీక్వెల్‌ ‘కల్కి 2’ సినిమాలోనూ ప్రియాంక నటిస్తోందని సమాచారం. త్వరలో ఈ మేరకు అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అని చెబుతున్నారు.

రష్మిక ఆ రిస్క్‌ చేస్తుందా? ఆ యంగ్‌ హీరోయిన్‌ బయోపిక్‌లో నటిస్తుందా?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus