మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రియాంక విగ్రహం

ప్రియాంకా చోప్రా బాలీవుడ్ స్టార్ హీరోయిన్. నిక్ జోనస్ ఇప్పుడు గ్లోబల్ గా పాపులర్ అయిన పేరు. సోషల్ మీడియా లో ‘పిసి’ గా బాగా ఫేమస్ అయ్యింది. ఇదిలా ఉండగా త్వరలోనే ప్రియాంక చోప్రా మైనపు విగ్రహం ప్రఖ్యాత లండన్ “మేడం టుస్సాడ్స్” మ్యూజియంలో పెట్టబోతున్నారని సమాచారం. ఈ మేరకు మేడం టుస్సాడ్స్ బృందం ప్రియాంకకు తెలియజేశారట. నిక్ తో వివాహం జరిగిన తరువాత ప్రియాంక అమెరికా లోని న్యూయార్క్ నగరంలో స్థిరపడిందని సమాచారం. అక్కడ హాలీవుడ్ చిత్రాలలోను, టీవీ సిరీస్ లలో నటిస్తూ బిజీగా గడుపుతూ బిజీగా ఉంది ప్రియాంక.

ఈ క్రమంలో మేడం టుస్సాడ్స్ బృందం న్యూ యార్క్ వెళ్ళి మరీ ప్రియాంక కొలతలను తీసుకున్నారట. 2018 నుండీ ప్రియాంక విగ్రహం పై కసరత్తు జరుగుతుందని తెలుస్తుంది. 2017 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకల్లో ప్రియాంక ధరించిన బంగారు వన్నెలో ఉండే లాంగ్ గౌన్ డ్రెస్ లో ఈమె విగ్రహం ఉంటుందని తెలుస్తుంది. ఇక ఇదే విషయం పై ప్రియాంక మాట్లాడుతూ.. ‘మేడం టుస్సాడ్స్ బృందంతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది, నాకు వారిచ్చిన ఈ గౌరవానికి ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చింది. ‘బాహుబలి’ తరువాత ప్రభాస్, ‘భరత్ అనే నేను’ చిత్రం తరువాత మహేష్ విగ్రహాన్ని కూడా వారు పెట్టిన సంగతి తెలిసిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus