Priyanka Chopra: మహేష్‌ కూతురు.. నా కూతురు కలసి.. వైరల్‌ అవుతున్న ప్రియాంక ఎక్స్‌ పోస్టులు

ఓవైపు పోస్టర్‌ మీద పోస్టర్‌ రిలీజ్‌ చేస్తూ రాజమౌళి అండ్‌ కో సినిమా మీద హైప్‌ను ఓ లెవల్‌లో ఎక్కిస్తుంటే.. మరోవైపు సినిమా చుట్టూరా విషయాల గురించి ఎక్స్‌లో ప్రశ్నలకు రిప్లై ఇస్తూ ప్రియాంక చోప్రా ఆ హైప్‌ను, ఉత్సాహాన్ని డబుల్ చేస్తోంది. ఇటీవల తన ఎక్స్‌లో అభిమానులతో ముచ్చటిస్తూ కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. అందులో హైదరాబాదీ ఫుడ్‌ గురించి, ఇక్కడకు వస్తే సినిమా షూటింగ్‌ లేనప్పుడు తాము చేసిన సందడి గురించి చెప్పుకొచ్చింది.

Priyanka Chopra

మహేష్‌బాబు – రాజమౌళి – ప్రియాంక చోప్రా – పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘గ్లోబ్‌ట్రాటర్‌’. ఈ టైటిల్‌ ప్రస్తుతానికి మాత్రమే. నవంబర్‌ 15న జరగబోయే గ్లోబ్‌ట్రాటర్‌ ఈవెంట్‌లో అసలు పేరు అనౌన్స్‌ చేస్తారు అని చెబుతున్నారు. ఈ ఈవెంట్‌ కోసం సినిమా టీమ్‌ అంతా హాజరవుతుంది అని చెబుతున్నారు. ఈ విషయం అటుంచితే నిన్న రాత్రి ప్రియాంక చోప్రా ఎక్స్‌లో అభిమానులతో ముచ్చటించింది. అందులో కొన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి.

సినిమా షూటింగ్‌కి మీ కుటుంబాన్ని తీసుకెళతారా? లేదా పూర్తిగా పనిపై దృష్టి పెడతారా ? అని ఒకరు అడిగితే.. ఇటీవల నా కూతురు హైదరాబాద్‌లో షూటింగ్‌ అవుతున్నప్పుడు సెట్‌కు వచ్చింది. అక్కడ మహేశ్ కూతురు సితారతో చాలా సరదాగా గడిపింది. రాజమౌళి గారి ఫామ్‌ హౌస్‌కి వెళ్లింది. అక్కడ ఓ లేగదూడ చూసి మురిసిపోయింది అని చెప్పుకొచ్చింది ప్రియాంక. హైదరాబాద్ బిర్యానీ రుచి చూశారా అని మరో ఫ్యాన్‌ అడిగితే.. హైదరాబాద్ బిర్యానీ ప్రపంచంలోనే బెస్ట్ అని చెప్పింది..

మీ నిక్ జోనస్‌కు హిందీ నేర్పించారా అని అడగ్గా… ఖానా, పానీ, ప్యార్, పనీర్ లాంటి పదాలు అయితే నేర్పించాను. మరికొన్ని పదాలు ఆయనే నేర్చుకున్నాడు అని చెప్పింది. ఇక ‘గ్లోబ్‌ ట్రాటర్‌’ సినిమాలో ప్రియాంక.. మందాకినిగా కనిపించబోతోంది. ఈ మేరకు ఇటీవల రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ లుక్‌ అదిరిపోయింది. చీర కట్టిన గన్‌ అంటూ ఫ్యాన్స్‌ మెచ్చుకుంటున్నారు.

నేను రివర్స్‌లో మీదకెళ్తా.. నువ్వు కెరీర్‌లో పైకి వెళ్తున్నావ్‌.. విజయ్‌ స్పీచ్‌ వైరల్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus