బిగ్ బాస్ హౌస్ లో ఆఖరి వారం కెప్టెన్సీ టాస్క్ అనేది రసవత్తరంగా మారింది. ఇందులో భాగంగా మిసెస్ బిగ్ బాస్ ని చంపింది ఎవరు ? అనేది పోలీసులు అయిన అర్జున్ – అమర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈలోగా హౌస్ లో పల్లవి ప్రశాంత్ , ఇంకా అశ్విని ఇద్దరూ కూడా హత్యకి గురి అయ్యారు. వీటిని క్లూస్ ఆధారంగా కనిపెట్టమని చెప్పాడు బిగ్ బాస్. ముద్దాయిని జైల్ లోకి వేయమని ఆదేశించాడు. అన్నీ ఆలోచించిన పోలీస్ టీమ్ రతికని అనుమానించి జైల్ లో పెట్టింది.
నిజానికి ఈరెండు హత్యలు సీక్రెట్ టాస్క్ లో భాగంగా శివాజీ చేసినవి. కానీ, పోలీసులు రతికని అనుమానించారు. అలాగే, ఆ తర్వాత శివాజీని సైతం పట్టుకుని జైల్ కి పంపారు. పోలీసులకి ముగ్గురు ముద్దాయిలని పట్టుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే, మూడో ముద్దాయి ఎవరు అనేది మాత్రం కనిపెట్టేందుకు చాలా కష్టపడ్డారు. అమర్ అయితే ప్రియాంక అని బలంగా అర్జున్ కి చెప్పాడు. కానీ, అర్జున్ ప్రియంక కాదేమో అని వాదించాడు.
తర్వాత బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) ప్రియాంకకి సైతం సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో ప్రియాంక ఫస్ట్ గౌతమ్ ని మర్డర్ చేసింది. గౌతమ్ మర్డర్ అయిన తర్వాత బిగ్ బాస్ హ్యాండ్ వాష్ ప్లేస్ లో టీ పెట్టమని చెప్పాడు. ఎవరైతే ముందుగా హ్యాండ్ వాష్ టీతో కడుక్కుంటారో వాళ్లు హత్యకి గురి అవుతారని సీక్రెట్ టాస్క్ లో భాగంగా ప్రియాంకకి చెప్పాడు. ప్రియాంక ఎవ్వరికీ తెలియకుండా హ్యాండ్ వాష్ ప్లేస్ లో టీని పోసింది.
అక్కడికి వచ్చిన యావర్ తెలియకుండానే టీ తో హ్యాండ్స్ వాష్ చేస్కుని దొరికిపోయాడు. దీంతో యావర్ కూడా అవుట్ అయ్యాడు. ఇక్కడే పోలీసులు బుర్రని వాడారు. ఉన్న కొద్దిమందిలో నలుగురు దెయ్యాలుగా మారినపుడు మిగిలిన వారిలోనే హంతకుడు ఉన్నారని గ్రహించారు. అయితే, ఇక్కడే బిగ్ బాస్ వారికి మూడు ఆప్షన్స్ ఇచ్చాడు. ఇందులో ఆల్రెడీ శివాజీని , రతికని జైల్ లో పెట్టారు. ఇక మిగిలింది ఒకే ఒక ఆఫ్షన్. ఇందులో శోభాశెట్టి, ప్రియాంక మాత్రమే మిగిలారు.
కాబట్టి ఇద్దరూ లెక్కలు వేసుకుని ప్రియాంకని జైల్లో పెడితే ప్రియాంక టాస్క్ ఫైయిల్ అయినట్లే. అలా కాకుండా శోభాశెట్టి ని జైల్లో పెడితే మాత్రం ప్రియాంక ఈటాస్క్ గెలిచి కంటెండర్ అవుతుంది. ఇప్పటికే బిగ్ బాస్ రూల్స్ ప్రకారం ఆటలో అవుట్ అయినవాళ్లు కెప్టెన్సీ రేస్ నుంచీ తప్పుకుంటారు. గౌతమ్ , యావర్, అశ్విని, పల్లవి నలుగురుతో పాటుగా శివాజీ కూడా రేస్ నుంచీ తప్పుకున్నాడు. ఇక మిగిలిన వాళ్లలో ఎవరు ముందుకు వెళ్తారు. ? ఎవరు టాస్క్ లో బెస్ట్ ఇస్తారు అనేది చూడాలి. అదీ మేటర్.
మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!
స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!