Bigg Boss 5 Telugu: శ్రీరామ్ ఎమోషన్.. పింకీ చేష్టలకి షాక్ అయిన అనీమాస్టర్..!

బిగ్ బాస్ హౌస్ లో 8వ వారం నామినేషన్స్ అనేవి చాలా ఆసక్తికరంగా సాగాయి. హౌస్ లోకి పోస్ట్ మాన్ వచ్చినపుడు ఇద్దరు వచ్చి మరో ఇద్దరికి వచ్చిన లెటర్స్ ని ఇవ్వాలి. ఇక్కడే బిగ్ బాస్ ఎవరిద్దరి మద్యలో ఎక్కువగా బాండింగ్ ఉందో వారి లెటర్స్ ని మరొకరి చేతిలో పెట్టాడు. అంతేకాదు, లెటర్ క్రష్ చేసి చదవలేని వాళ్లు నామినేట్ అవుతారు అని కూడా కండీషన్ పెట్టాడు. శ్రీరామ్ అండ్ రవి ఇద్దరి లెటర్స్ వచ్చినపుడు రవి శాక్రిఫైజ్ చేసి శ్రీరామ్ కి తన ఇంటి నుంచీ వచ్చిన లెటర్ ని ఇచ్చాడు.

ఇక్కడే లెటర్ చదివేటపుడు మాములుగానే ఉన్న శ్రీరామ్ పర్సనల్ గా బెడ్ రూమ్ లోకి వెళ్లి లెటర్ ని చూస్తూ ఎమోషనల్ అయిపోయాడు. అక్కడే ఉన్న అనీమాస్టర్ శ్రీరామ్ ని ఓదార్చే ప్రయత్నం చేసింది. అంతేకాదు, పింకీ కూడా శ్రీరామ్ కళ్లు తుడూస్తూ హగ్ ఇచ్చింది. పనిలో పని అంటూ రెండు ముద్దుకు కూడా ఇచ్చేసి ఓదార్చింది. పక్కనే ఉన్న అనీమాస్టర్ పింకీ చేసిన చేష్టలకి కాస్త షాక్ అయ్యింది. ఛాన్స్ దొరికింది కదా అని ముద్దులు ఇచ్చేస్తున్నావా అంటూ డైలాగ్ వేసింది.

నిజానకికి విశ్వ-లోబోలకు రవి, శ్రీరామ్‌ లెటర్స్‌ వచ్చాయి. ఇలా లెటర్స్ రాగానే శ్రీరామ్ రవికోసం శాక్రిఫైజ్ చేస్తానని చెప్పాడు. కానీ లోబో మాత్రం రవికి ఆల్రెడీ ఒక లెటర్ ఉందని, అంతేకాకుండా ఒక బొమ్మ కూడా ఉందని, శ్రీరామ్ కి అస్సలు ఏమీ లేవని చెప్పాడు. రవి కూడా అదే విషయాన్ని చెప్తూ తన లెటర్ ని శాక్రిఫైజ్ చేసి నామినేషన్స్ లోకి వచ్చాడు. అదీ మేటర్.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus