Priyanka Jawalkar, Allu Arjun: ప్రియాంక ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా?

టాక్సీవాలా సినిమాతో ఓవర్ నైట్ లో ఫేమస్ అయిన అనంతపురం బ్యూటీ ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించిన సినిమాలు వరుసగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. తిమ్మరుసు, ఎస్ఆర్ కళ్యాణమండం సినిమాలతో విజయాలను అందుకున్న ప్రియాంక జవాల్కర్ కు కొత్త సినిమా ఆఫర్లు వస్తున్నాయి. సినిమాల ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన ప్రియాంక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. టాక్సీవాలా సక్సెస్ తర్వాత మంచి కథ కోసం ఎదురుచూడటం వల్ల గ్యాప్ వచ్చిందని ప్రియాంక తెలిపారు.

తాను నటించిన గమనం సినిమా దాదాపుగా పూర్తి కావచ్చిందని ప్రియాంక అన్నారు. సినిమాల్లో తన నటనను ఫ్రెండ్స్ తో కలిసి సమీక్ష చేసుకుంటానని ప్రియాంక చెప్పుకొచ్చారు. దర్శకుడు చెప్పిన విషయాలనే తాను పట్టించుకుంటానని ప్రియాంక తెలిపారు. కొన్ని గాసిప్స్ కామెడీగా ఉంటాయని మరికొన్ని హర్ట్ చేస్తాయని ప్రియాంక అన్నారు. తన పాస్ పోర్ట్ సైజ్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిందని ప్రియాంక వెల్లడించారు. ఇతర ఇండస్ట్రీలలో కూడా ఫోటో గురించి ఎక్కువగా అడుగుతున్నారని ప్రియాంక చెప్పుకొచ్చారు.

స్టార్ హీరో అల్లు అర్జున్ అంటే తనకు క్రష్ అని ఆమె అన్నారు. డ్యాన్స్ రాకపోవడం తనకు మైనస్ అని త్వరలోనే తనలో మంచి డ్యాన్సర్ ను చూస్తారని ప్రియాంక వెల్లడించారు. విజయ్ దేవరకొండ చిల్ గా ఉంటాడని సత్యదేవ్ హార్డ్ వర్క్ చేస్తాడని కిరణ్ అబ్బవరం అమాయకంగా ఉంటాడని ప్రియాంక జవాల్కర్ తెలిపారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus