మోడల్ రంగం వేరు.. సినిమా రంగం వేరు. మొదటి రంగంలో ఎంత పేరు తెచ్చుకున్నప్పటికీ కొంతమందికి సంతృప్తి ఉండదు. నటనలోనూ రాణించాలని కలలుకంటుంటారు. మొదటి ఛాన్స్ కోసం ఆరాటపడుతుంటారు. ఛాన్స్ వస్తే తన ట్యాలెంట్ చూపించాలని ఆశపడుతుంటారు. ఆలా ఆశపడుతున్న వారిలో మలయాళ బ్యూటీ, మోడలింగ్ లో దూసుకుపోతున్న టాప్ మోడల్ ప్రియాంక కరుణాకరుణ్ ఒకరు. అవకాశాల కోసం నిర్మాతల చుట్టూ తిరిగే ఓపిక లేక అందాన్ని అస్త్రం గా మార్చుకుంది. సినిమాలో తాను ఎంతమేర అందాలను ఆరబోయగలదో అంతమేర ఫోటో షూట్ చేసింది. ఒంటి మీద ఒకే ఒక షర్ట్ వేసుకొని హీట్ పుట్టించింది. పైగా టాప్ లో బటన్స్ తీసేసి క్లీవేజ్ షో తో పిచ్చెక్కిస్తోంది. ఈ హాట్ ఫోటోలను మలయాళీ మ్యాగ్ జైన్ ప్రచురింది.
ఇంకేముంది చూసిన వారంతా నోరెళ్లబెడుతున్నారు. దర్శకనిర్మాతలు ఆమె అందానికి ఆకర్షితులయ్యారు. పైగా సినిమాలో నటించకముందే ఆమెకు అభిమానులు ఏర్పడిపోయారు. అయితే ఆమె ఏ సినిమాలో మొదటిసారి నటించబోయేది మాత్రం ఇప్పుడే చెప్పలేకపోతున్నారు. ఈ మధ్య బోల్డ్ సినిమాలు తెలుగులో బాగా విజయం సాధిస్తున్నాయి. అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100 వంటి చిత్రాలు సంచలన విజయం సాధించాయి. ఇప్పుడు అటువంటి కథలను చాలామంది ప్రిపేర్ చేసుకుంటున్నారు. సో ప్రియాంక ఆ కథల్లో హీరోయిన్ గా ఛాన్స్ అందుకోవడం గ్యారంటీ అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.