Mahesh Koneru: మహేష్ కోనేరు మృతితో వాళ్లు టెన్షన్ పడుతున్నారా?

ఫిల్మ్ జర్నలిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టి తక్కువ సమయంలోనే పీఆర్వోగా, నిర్మాతగా మహేష్ కోనేరు ఎదిగారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు వచ్చిన మహేష్ కోనేరు రాజమౌళి ప్రారంభించిన వెబ్ సైట్ కోసం పని చేయడంతో పాటు బాహుబలి సినిమాకు పీఆర్వోగా పని చేయడం ఆయన కెరీర్ కు ప్లస్ అయింది. మంచి పీఆర్వోగా పేరు సంపాదించుకోవడంతో మహేష్ కోనేరు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కుటుంబానికి సన్నిహితుడు అయ్యారు. ఐదు రోజుల క్రితం మహేష్ కోనేరు గుండెపోటుతో మృతి చెందారు.

మహేష్ కోనేరు నిర్మాతగా 118, నా నువ్వే, తిమ్మరుసు, మిస్ ఇండియా సినిమాలు తెరకెక్కాయి. ఈ సినిమాలలో 118, తిమ్మరుసు సినిమాలు సక్సెస్ సాధించాయి. మహేష్ కోనేరు నిర్మాతగా అల్లరి నరేష్, సందీప్ కిషన్, నాగశౌర్య హీరోలుగా మూడు సినిమాలకు సంబంధించిన ప్రకటనలు వెలువడ్డాయి. అయితే మహేష్ కోనేరుకు ఏకంగా 80 కోట్ల రూపాయల అప్పు ఉన్నట్టు సమాచారం. ఆయన మంచి వ్యక్తి కావడంతో ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, జర్నలిస్టులు ఆయనను నమ్మి అప్పు ఇచ్చినట్టు తెలుస్తోంది.

మహేష్ కోనేరు తీసిన సినిమాల్లో ఏ సినిమా ఆయనకు భారీస్థాయిలో నష్టాలను మిగల్చలేదు. మహేష్ కోనేరుకు చెడు అలవాట్లు కూడా లేవు. మహేష్ కోనేరు గుండెపోటుతో మృతి చెందడంతో ఆయనకు అప్పులు ఇచ్చిన వాళ్లు టెన్షన్ పడుతున్నట్టు సమాచారం. 80 కోట్ల రూపాయలు మహేష్ కోనేరు ఏం చేశాడనే ప్రశ్నకు సమాధానం తెలియడం లేదు. ఆ డబ్బుతో మహేష్ కోనేరు ఎక్కడైనా ఆస్తులు కొన్నాడా? అనే విషయం తెలియాల్సి ఉంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus