Kushi Movie: 21 ఏళ్ళ ‘ఖుషి’ గురించి నిర్మాత ఎ.ఎం.రత్నం చెప్పిన ఆసక్తికర విషయం..!

Advertisement

పవన్ కళ్యాణ్ హీరోగా భూమిక హీరోయిన్ గా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ఖుషి’. ‘శ్రీ సూర్య ఫిలిమ్స్’ బ్యానర్ పై ఏ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈరోజుతో ఈ చిత్రం విడుదలై 21 ఏళ్ళు పూర్తికావస్తోంది. 2001 వ సంవత్సరం ఏప్రిల్ 27న ఈ మూవీ విడుదలైంది. పవన్ కళ్యాణ్ వరుస హిట్లతో జోష్ లో ఉన్న టైములో వచ్చిన ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్.

Click Here To Watch NOW

రామ్- కామ్ సినిమాల్లో ఇంత బ్లాక్ బస్టర్ అయిన ఆ టైములో లేదు. ఒక్క నడుము సీన్ తో సినిమా కథనం మొత్తం మారిపోతుంది. హీరోయిన్ నడుముకి ఇంత అందం ఉంటుందా అని చాటి చెప్పిన మూవీ ‘ఖుషి’. ఈ సినిమాలో చూపించినట్టు హీరోయిన్ నడుముని ఇప్పటివరకు మరో సినిమాలో చూపించలేదు అని అప్పటి కుర్రకారు ప్రశంసల వర్షం కురిపించారు. ఆ సన్నివేశానికి మణిశర్మ అందించిన నేపధ్య సంగీతం కూడా బాగా ప్లస్ అయ్యింది.

అంతేకాదు ఈ సినిమాలో అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇదిలా ఉండగా.. తెలుగులో క్లాసిక్ గా నిలిచిన ‘ఖుషి’ రీమేక్ అని అంటుంటారు. ఇది రీమేక్ అన్నది నిజమే. కానీ ఈ చిత్రం నిర్మాత ఎస్.జె.సూర్య మాత్రం ఇటీవల ఓ సందర్భంలో ‘ఖుషి’ రీమేక్ కాదు అని చెప్పుకొచ్చారు. తమిళంలో విజయ్, జ్యోతిక నటించిన ‘ఖుషి’ మూవీ 2000 సంవత్సరంలో మే 19న రిలీజ్ అయ్యింది. అలాంటప్పుడు మన తెలుగు ‘ఖుషి’ కూడా రీమేకే.

కానీ ఆ కథని ముందుగా పవన్ కళ్యాణ్ కే చెప్పారట ఎస్.జె.సూర్య. కానీ ఆ టైంకి పవన్ కళ్యాణ్ ‘బద్రి’ సినిమా షూటింగ్లో ఉన్నారట. పారలెల్ గా రెండు సినిమాలు చేసెయ్యడానికి కూడా ఆయన రెడీ అయ్యారట. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల తెలుగు ‘ఖుషి’ ని ఆలస్యంగా తీసినట్టు చెప్పుకొచ్చారు ఏ.ఎం.రత్నం. ఆ తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ తో ‘బంగారం’ అనే సినిమాని నిర్మించారు. ప్రస్తుతం ‘హరి హర వీర మల్లు’ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus